ఆస్తుల కేసులో కోర్టుకు సీఎం జగన్ గైర్హాజర్: అబ్సెంట్ పిటిషన్ దాఖలు

By narsimha lodeFirst Published Jan 24, 2020, 11:18 AM IST
Highlights

ఆస్తుల కేసులో  నాంపల్లి సీబీఐ కోర్టుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ హాజరుకాలేదు. 

హైదరాబాద్: ఆస్తుల కేసులో   ఏపీ సీఎం  జగన్  శుక్రవారం నాడు నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు గైర్హాజరయ్యారు. ఇవాళ కోర్టుకు హాజరుకాలేనని జగన్ తరపు న్యాయవాది అబ్సెంట్ పిటిషన్  దాఖలు చేశారు. ఈ కేసులో  వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు  పలువురు అధికారులు కోర్టుకు హాజరయ్యారు.

ఆస్తుల కేసులో  వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి,  ఐఎఎస్ అధికారులు శ్రీలక్ష్మి, రాజగోపాల్, రిటైర్డ్   ఐఎఎస్ అధికారి శ్యామ్యూల్ కూడ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు.  గత వారం కూడ ఈ కేసులో సీఎం వైఎస్ జగన్ హాజరుకాలేదు. గత వారం కూడ  ఈ కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్ నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరుకాలేదు. 

Also read:షాక్:జగన్‌ పిటిషన్ల కొట్టివేసిన సీబీఐ కోర్టు

ఈ నెల 10వ తేదీన కోర్టు ఆదేశాల మేరకు సీఎం వైఎస్ జగన్ కోర్టుకు హాజరయ్యారు.  వ్యక్తిగతంగా సీఎం జగన్  హాజరయ్యే విషయమై సీబీఐ కోర్టు నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని సమాచారం.

సీబీఐ విచారణ పూర్తయ్యే వరకు ఈడీ విచారణను చేపట్టరాదని జగన్ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడ సీబీఐ కోర్టు  ఈ నెల 17వ తేదీన కొట్టేసింది. ఆస్తుల కేసు వ్యవహారంలో తాను వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కాలేనని సీబీఐ కోర్టు లో అప్సెంట్ పిటిషన్ దాఖలు చేసిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ దాఖలు చేశారు.

ఈ నెల 17న పెన్నా సిమెంట్ అనుబంధ చార్జిషీట్ లో CBI కోర్ట్ కి హాజరైన మంత్రి సబితా, మాజీ మంత్రి ధర్మాన, ఐఏఎస్ అధికారిని శ్రీ లక్ష్మీ, విశ్రాంతి అధికారులు శ్యాముల్,వీడి రాజగోపాల్, RDO సుదర్శన్ రెడ్డి, తహశీల్దార్ ఎల్లమ్మ హాజరయ్యారు.

  

click me!