కస్తూర్బా స్కూల్లో మరో ఏడుగురికి కరోనా: మొత్తం 19కి చేరిన కేసులు

Published : Mar 01, 2021, 05:46 PM IST
కస్తూర్బా స్కూల్లో మరో ఏడుగురికి కరోనా: మొత్తం 19కి చేరిన కేసులు

సారాంశం

ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఝరాసంఘం కస్తూర్బా గాంధీ బాలికల స్కూల్లో మరో ఏడుగురు విద్యార్ధులకు కరోనా సోకింది. దీంతో మొత్తం కరోనా బారినపడిన విద్యార్ధుల సంఖ్య 19కి చేరుకొంది.


మెదక్: ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఝరాసంఘం కస్తూర్బా గాంధీ బాలికల స్కూల్లో మరో ఏడుగురు విద్యార్ధులకు కరోనా సోకింది. దీంతో మొత్తం కరోనా బారినపడిన విద్యార్ధుల సంఖ్య 19కి చేరుకొంది.

కరోనా సోకిన వారిని హోం క్వారంటైన్ లో ఉంచారు. హోం క్వారంటైన్ లో ఉన్న విద్యార్ధుల్లో ముగ్గురికి మాత్రమే  కరోనా లక్షణాలు ఉన్నాయని వైద్యులు చెప్పారు.కుటుంబసభ్యుల ద్వారా ఓ విద్యార్ధికి కరోనా సోకింది. ఆమె ద్వారా స్కూల్లో విద్యార్ధులకు కరోనా వ్యాప్తి చెందిందని వైద్యులు గుర్తించారు. 

బాలికల స్కూల్ లో పనిచేసే సిబ్బంది ఒకరికి కూడ కరోనా సోకింది.  గ్రామంలో ప్రతి ఒక్కరికీ కూడ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా సోకిన వారిని ఇతరులతో కలవకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకొంటున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే
School Holidays : ఈ గురువారం స్కూళ్ళకు సెలవేనా..? ఎందుకో తెలుసా?