తప్పిన ప్రమాదం:కుమురం భీం జిల్లాలో కూలిన అందవెల్లి బ్రిడ్జి

By narsimha lode  |  First Published Oct 19, 2022, 9:35 AM IST

కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని పెద్దవాగు కుప్పకూలింది. కూలిన బ్రిడ్జిని ఇవాళ అధికారులు పరిశీలించారు. త్వరగా ఈ బ్రిడ్జి  నిర్మాణ పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
 


ఆదిలాబాద్: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో  పెద్దవాగుపై నిర్మించిన అందవెల్లి బ్రిడ్జి  మంగళవారంనాడు అర్ధరాత్రి  కుప్పకూలింది. ఈ ఏడాది ఆగస్టు 14న ఈ వంతెన కుంగిపోయింది. దీంతో  ఈ వంతెన పై నుండి రాకపోకలను నిలిపివేశారు.దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు చెబుతున్నారు.కూలిన బ్రిడ్జిని ఇవాళ  ఉదయం పోలీసులు, రెవిన్యూ అధికారులు పరిశీలించారు.ఈబ్రిడ్జిని వెంటనే నిర్మించాలని  స్థానికులు  కోరుతున్నారు .గత కొన్ని  రోజులుగా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో  పెద్దవాగులో వరద పోటెత్తింది. ఈ వరద  ప్రవాహం కారణంగా బ్రిడ్జి కూలిపోయింది. ఈ బ్రిడ్జి  నిర్మాణం కోసం అధికారులు టెండర్లు పిలిచారని సమాచారం. అయితే పెద్దవాగులో వరద ప్రవాహం ఎకక్కువగా ఉండడంతో  పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని  ప్రచారం  సాగుతుంది. ఈ బ్రిడ్జి కూలిపోవడంతో 50 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

 భారీ వర్షాల  కారణంగా రెండు మాసాల క్రితం పెద్దవాగులో వరద పోటెత్తింది. ఈ వరద కారణంగా అందవెల్లి బ్రిడ్జి కుంగిపోయింది. దీంతో ఈ వంతెనపై నుండి రాకపోకలను నిలిపివేశారు ఈ బ్రిడ్జి  ఏ క్షణమైనా కుుప్పకూలే అవకాశం ఉందని భావించిన  అధికారులు రాకపోకలను నిలిపివేశారు .ఈ వంతెనపై రాకపోకలను నిలిపివేయడంతో  మూడు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల గుండా ప్రజలు వెళ్తున్నారు. పెద్దవాగును దాటేందుకు నాటుపడవలను  ఆశ్రయిస్తున్నారు.

Latest Videos

ఈ ఏడాది సెప్టెంబర్  22న పెద్దవాగును  నాటు  పడవ ద్వారా దాటుతున్న నలుగురు   ప్రమాదానికి గురయ్యారు.వాగులో నీటి ఉధృతికి నాటు పడవ  బోల్తా పడింది. దీంతో వాగులో నలుగురు కొట్టుకుపోతున్న సమయంలో అక్కడే ఉన్న స్థానికులు రక్షించారు.

alsoread:కొమరంభీమ్ జిల్లాలో నాటు పడవ బోల్తా: సురక్షితంగా బయటపడిన నలుగురు

దహేగాం, బెజ్జూరు,కాగజ్ నగర్ వాసులు  ఈ వంతెనను ఉపయోగిస్తారు .ఈ వంతెన కూలిపోవడంతో సుదూర ప్రాంతాల  గుండా గమ్యస్థానాలకు  చేరుకుంటున్నారు. మంచిర్యాల జిల్లా తాండూరు, బెల్లంపల్లి మీదుగా కాగజ్ నగర్ కు  చేరుకుంటున్నారు.. ఇంత దూరం ప్రయాణం చేయాలంటే సమయంతో పాటు ఖర్చు కూడా పెరగనుంది. దీంతో ఈ వంతెన దాటడానికి  నాటు పడవలను ఆశ్రయిస్తున్నారు.
 

click me!