కాంగ్రెస్ సీఎం అభ్యర్థులంతా ఓటమి బాట

By ramya neerukondaFirst Published Dec 11, 2018, 12:32 PM IST
Highlights

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘెర పరాభవం ఎదురైంది. ఈ ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధించాలనే నిర్ణయంతో.. టీడీపీతో పొత్తు కుదుర్చుకుంది. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘెర పరాభవం ఎదురైంది. ఈ ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధించాలనే నిర్ణయంతో.. టీడీపీతో పొత్తు కుదుర్చుకుంది. మహాకూటమి పేరిట ఎన్నికల బరిలోకి దిగింది. కానీ.. గత ఎన్నికల్లో సాధించిన సీట్లు కూడా ఈ ఎన్నికల్లో రాకపోవడం గమనార్హం. ఈ సంగతి పక్కన పెడితే.. కాంగ్రెస్ సీఎం అభ్యర్థులంతా ఓటమి బాట పట్టారు.

మహాకూటమి అధికారంలోకి వస్తే.. కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి, జానారెడ్డి, డీకే అరుణ, గీతారెడ్డి, దామోదర రాజనర్సింహ, మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి లు.. సీఎం రేసులో ఉన్నారు. సీఎం పదవి పక్కన పెడితే.. వీరిలో ఉత్తమ్, భట్టి మినహా.. మిగిలిన ఎవ్వరూ విజయం సాధించలేదు. గత ఎన్నికల్లో విజయ దుందుబీ మోగించిన వీరంతా.. ఈ ఎన్నికల్లో ఓటమి చవి చూశారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం.. గెలుపు దిశగా పయనమౌతున్నారు. భట్టి విక్రమార్క విషయానికి వస్తే.. మధిర నియోజకవర్గంలో.. ఆయనకు స్వంతంత్ర అభ్యర్థిగా గట్టి పోటీనిస్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోవడం సంగతి పక్కన పెడితే.. కీలక నేతలు కూడా ఓటమి చివిచూడటం కాంగ్రెస్ కి పెద్ద దెబ్బే అని తెలుస్తోంది. 

click me!