
పాత ప్రాజెక్టులకే పేరు మార్చి కేసీఆర్ రీడైజన్ల పేరుతో వేల కోట్లు అవకతవకలకు పాల్పడ్డారని రాహుల్ గాంధీ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు 2 లక్షల రుణమాఫీని అందజేస్తామని, వరికి 2 వేలు, పత్తికి 7 వేలు, మిర్చికి 10 వేలు కనీస మద్ధతు ధర అందిస్తామని రాహుల్ హామీ ఇచ్చారు.
లక్ష మందికి ఉద్యోగాలు ఇస్తానన్న కేసీఆర్ ఆయన కుటుంబానికి, బంధువులకు మాత్రమే ఉపాధి కల్పించారన్నారు. మోడీ,కేసీఆర్ ఇద్దరూ ధనవంతులకు ఉపాధి కల్పిస్తున్నారని.. బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తున్నారని రాహుల్ ఎద్దేవా చేశారు.
ఎన్నికల్లో ఓడిపోతే ఫాంహౌస్‌కి వెళతారని చెప్పారు అది నిజమేనని రాహుల్ వ్యాఖ్యానించారు. మేనిఫెస్టోలో పేర్కొన్నట్లు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అందిస్తామని హామీ ఇచ్చారు. దళితులకు, గిరిజనులకు మూడెకరాల భూమి ఇస్తామని ఒక్కరికి కూడా ఇవ్వాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా ఆ హామీని అమలు చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు.
మండలానికో ముప్పై పడకల ఆసుపత్రితో పాటు ఇళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల కింద రూ. 5 లక్షల రుణాన్ని మంజూరు చేస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. మహాకూటమి అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలని రాహుల్ ప్రజలను కోరారు. భూసేకరణ చట్టం కింద వేలాది ఎకరాలు సేకరించారని.. కానీ వాటిని ఎందుకు ఉపయోగించలేదన్నారు.
ఈ చట్టాన్ని అమలు చేయడం ద్వారా మార్కెట్ రేటు కంటే నాలుగింతల ఎక్కువ మొత్తం రైతులకు చెల్లించేలా చట్టంలో పొందుపరిచామని రాహుల్ గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే భూపాల్‌పల్లిలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. రాఫెల్‌ను హెఏఎల్‌కు కాకుండా అనిల్ అంబానీకి అప్పగించి.. నరేంద్రమోడీ లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని రాహుల్ గాంధీ ఆరోపించారు.