ఇంటి దగ్గర దిగబెడతానని: 9 ఏళ్ల చిన్నారిపై యువకుడి అత్యాచారం

Siva Kodati |  
Published : Sep 10, 2019, 07:29 AM ISTUpdated : Sep 10, 2019, 07:35 AM IST
ఇంటి దగ్గర దిగబెడతానని: 9 ఏళ్ల చిన్నారిపై యువకుడి అత్యాచారం

సారాంశం

మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక గ్రామంలో పెట్టిన వినాయక మండపం దగ్గరికి వెళ్లి దర్శనానంతరం తిరిగి ఇంటికి బయల్దేరింది. ఆ సమయంలో బైకుపై వచ్చిన ఓ యువకుడు ఇంటి దగ్గర దిగబెడతానని చెప్పి చిన్నారిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.

మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం జరిగింది. తొమ్మిదేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక గ్రామంలో పెట్టిన వినాయక మండపం దగ్గరికి వెళ్లి దర్శనానంతరం తిరిగి ఇంటికి బయల్దేరింది.

ఆ సమయంలో బైకుపై వచ్చిన ఓ యువకుడు ఇంటి దగ్గర దిగబెడతానని చెప్పి చిన్నారిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.  కామాంధుడిని పట్టుకున్న స్థానికులు చితకబాది, పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Petrol Diesel Price: వాహనదారులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు.. మరింత పెరుగుతాయా?
Telangana: హైద‌రాబాద్‌కు స‌మీపంలో భారీ డెయిరీ ప్లాంట్‌... రూ. 400 కోట్ల‌తో