హుజూరాబాద్ అసెంబ్లీ బైపోల్: పోటీకి 760 పీల్డ్ అసిసెంట్లు 'సై'

Published : Jul 21, 2021, 01:15 PM IST
హుజూరాబాద్ అసెంబ్లీ బైపోల్: పోటీకి 760 పీల్డ్ అసిసెంట్లు 'సై'

సారాంశం

నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నిక తరహలోనే హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. తమను విధుల్లోకి తీసుకోకపోతే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామని ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రకటించారు.

హైదరాబాద్:హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని ఫీల్డ్ అసిస్టెంట్లు నిర్ణయం తీసుకొన్నారు. త్వరలోనే ఈ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి.మాజీ మంత్రి ఈటల రాజేందర్  హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేయడంతో  ఎన్నికలు అనివార్యంగా మారాయి.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హమీ పథకం కింద పనిచేస్తున్న 760 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించింది. ఫీల్డ్ అసిస్టెంట్లు  తమను విధుల్లోకి తీసుకోవాలని ఆందోళన నిర్వహిస్తున్నారు.

ఈ ఆందోళనకు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య మద్దతు ప్రకటించారు. తమను విధుల్లోకి తీసుకోకపోతే  హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీకి దిగుతామని ప్రకటించారు.  తమను విధుల్లోకి తీసుకొంటే  పోటీ నుండి తప్పుకొంటామని ఫీల్డ్ అసిసెంట్లు ప్రకటించారు. హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో  ఫీల్డ్ అసిస్టెంట్ల తరపున తాను ప్రచారం చేస్తానని  బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు  ఆర్. కృష్ణయ్య హామీ ఇచ్చారు.పీల్డ్ అసిస్టెంట్లు ఎన్నికల బరిలో నిలిస్తే బ్యాలెట్ పేపర్ చాలా పెద్దదిగా మారిపోయే అవకాశం ఉంది. ఫీల్డ్ అసిస్టెంట్ల డిమాండ్ పై ప్రభుత్వం  ఏ రకంగా స్పందిస్తోందనేది అందరూ ఆసక్తిని చూపుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

ఏటీఎమ్‌లలో కొత్త ర‌కం దోపిడి.. సైబ‌ర్ క్రైమ్ కోర్స్ నేర్చుకుని క్రిమిన‌ల్‌గా మారిన యువ‌కుడు
పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu