తెలంగాణ: భారీగా పడిపోయిన కరోనా కేసులు.. కొత్తగా 731 మందికి పాజిటివ్

Siva Kodati |  
Published : Jul 18, 2021, 10:28 PM IST
తెలంగాణ: భారీగా పడిపోయిన కరోనా కేసులు.. కొత్తగా 731 మందికి పాజిటివ్

సారాంశం

తెలంగాణలో కొత్తగా 578 కరోనా కేసులు నమోదవ్వగా.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 731 మంది కరోనా నుంచి కోలుకోగా 9,824 మంది చికిత్స పొందుతున్నారు. 

తెలంగాణలో కరోనా వ్యాప్తి బాగా అదుపులోకి వచ్చింది. గడచిన 24 గంటల్లో 90,966 కరోనా పరీక్షలు నిర్వహించగా, 578 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 75 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కరీంనగర్ జిల్లాలో 53, ఖమ్మం జిల్లాలో 43 కరోనా కేసులు వెల్లడయ్యాయి. కొమరంభీమ్ ఆసిఫాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 731 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,36,627 కరోనా బారినపడగా.. 6,23,044 మంది కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 9,824 మంది చికిత్స పొందుతున్నారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 3,759కి పెరిగింది. 

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 5, భద్రాద్రి కొత్తగూడెం 14, జీహెచ్ఎంసీ 75, జగిత్యాల 21, జనగామ 13, జయశంకర్ భూపాలపల్లి 16, గద్వాల 3, కామారెడ్డి 0, కరీంనగర్ 53, ఖమ్మం 43, ఆసిఫాబాద్ 0, మహబూబ్‌నగర్ 14, మహబూబాబాద్ 15, మంచిర్యాల 36, మెదక్ 5, మేడ్చల్ మల్కాజిగిరి 21, ములుగు 10, నాగర్ కర్నూల్ 7, నల్గగొండ 25, నారాయణపేట 1, నిర్మల్ 2, నిజామాబాద్ 7, పెద్దపల్లి 32, సిరిసిల్ల 15, రంగారెడ్డి 16, సిద్దిపేట 12, సంగారెడ్డి 9, సూర్యాపేట 38, వికారాబాద్ 3, వనపర్తి 9, వరంగల్ రూరల్ 16, వరంగల్ అర్బన్ 36, యాదాద్రి భువనగిరిలో 6 చొప్పున కేసులు నమోదయ్యాయి. 

 

PREV
click me!

Recommended Stories

Top 5 Cleanest Railway Stations : దేశంలో అత్యంత పరిశుభ్రమైన రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
Christmas Holidays 2025 : ఒకటి రెండ్రోజులు కాదు... వచ్చే వారమంతా స్కూళ్ళకు సెలవులే..?