పాతికేళ్ల క్రితం ఆపరేషన్: బిడ్డకు జన్మనిచ్చిన 50 ఏళ్ల మహిళ

Published : Apr 18, 2020, 11:27 AM IST
పాతికేళ్ల క్రితం ఆపరేషన్: బిడ్డకు జన్మనిచ్చిన 50 ఏళ్ల మహిళ

సారాంశం

తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో యాబై ఏళ్ల వయస్సు గల మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. పాతికేళ్ల క్రితం పిల్లలు పుట్టకుండా ఆమె ఆపరేషన్ చేయించుకుంది.

ఖమ్మం: తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విచిత్రమైన సంఘటన చేసుకుంది. యాభై ఏళ్ల వయస్సులో రాములమ్మ అనే మహిళ బిడ్డకు జన్మ ఇచ్చింది. పిల్లలు పుట్టకుండా పాతికేళ్ల క్రితం ఆమె ఆపరేషన్ చేయించుకుంది. అయినప్పటికీ ఆమెకు ఇప్పుడు బిడ్డ పుట్టింది.

రాములమ్మకు ఇప్పటికే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. రాములమ్మకు పురుటి నొప్పులు రావడంతో 108కు ఫోన్ చేశారు. అంబులెన్స్ వచ్చి ఆమెను భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తీసుకుని వెళ్లింది. అక్కడ ఆమె పురుడు పోసుకుంది. మందులు సరిగా వాడకపోవడంతో బిడ్డ బరువు తక్కువగా ఉంది. 

PREV
click me!

Recommended Stories

Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!
Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?