అక్బరుద్దీన్ నియోజకవర్గంలో 40 వేల ఓట్లు గల్లంతు

By sivanagaprasad kodatiFirst Published Dec 7, 2018, 1:36 PM IST
Highlights

తెలంగాణ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. అయితే కొన్ని చోట్ల పోలింగ్ బూత్‌ల వద్ద క్యూలైన్లలో నిలుచొన్న ఓటర్లకు నిరాశ ఎదురైంది. వారి ఓట్లు గల్లంతు కావడంతో జనం అధికారులతో వాగ్వావాదానికి దిగారు

తెలంగాణ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. అయితే కొన్ని చోట్ల పోలింగ్ బూత్‌ల వద్ద క్యూలైన్లలో నిలుచొన్న ఓటర్లకు నిరాశ ఎదురైంది. వారి ఓట్లు గల్లంతు కావడంతో జనం అధికారులతో వాగ్వావాదానికి దిగారు.

ఎంఐఎం అగ్రనేత అక్బరుద్దీన్ ఒవైసీ బరిలో నిలిచిన చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో దాదాపు 40 వేల ఓట్లు గల్లంతయ్యాయి. దీనితో పాటు జాంబాగ్ డివిజన్, జూబ్లీహిల్స్‌లో సెగ్మెంట్‌లోని చాలా చోట్ల ఓట్లు గల్లంతైనట్టుగా వార్తలు వస్తున్నాయి.

సంగారెడ్డి పట్టణంలోని రాజంపేట కాలనీలో 50 మంది ఓట్లు గల్లంతవ్వడంతో తమకు ఓటు హక్కు కల్పించాలంటూ అధికారులను ఓటర్లు నిలదీశారు. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఓటు గల్లంతుకావడంతో ఎన్నికల సంఘం తీరు పట్ల ఆమె అసహనం వ్యక్తం చేశారు. 

click me!