ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి

Siva Kodati |  
Published : Feb 06, 2019, 07:50 AM IST
ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి

సారాంశం

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం అర్థరాత్రి దాటాక ఖమ్మం నుంచి నేలకొండపల్లి వైపు వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. 

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం అర్థరాత్రి దాటాక ఖమ్మం నుంచి నేలకొండపల్లి వైపు వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.

ఈ క్రమంలో అటుగా వెళ్తున్న వాహనదారులు ప్రమాదాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మరణించిన వారంతా నేలకొండపల్లిలో ఒకే చెందిన వారిగా గుర్తించారు. మృతులను వెంకటేశ్వర్లు, పిచ్చమ్మ, కోదండరామ్, ప్రణయ్‌‌గా తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad లో ఏఐ డేటా సెంటర్.. ఈ ప్రాంతం మరో హైటెక్ సిటీ కావడం ఖాయం
Kavitha Kalvakuntla Pressmeet: రేవంత్ రెడ్డి, హరీష్ రావుపై రెచ్చిపోయిన కవిత| Asianet News Telugu