ముగ్గురి ప్రాణాలు తీసిన.. అర్థరాత్రి షికారు

Published : Nov 20, 2018, 09:58 AM ISTUpdated : Nov 20, 2018, 10:07 AM IST
ముగ్గురి ప్రాణాలు తీసిన.. అర్థరాత్రి షికారు

సారాంశం

బైక్.. అతి వేగంతో వచ్చి.. అదుపుతప్పి మెట్రో పిల్లర్ ని ఢీకొట్టిందని స్థానికులు చెబుతున్నారు. 

మెట్రో పిల్లర్ ని బైక్ ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందిన సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. మెట్టుగూడలోని మెట్రో పిల్లర్ ని ఓ బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

బైక్.. అతి వేగంతో వచ్చి.. అదుపుతప్పి మెట్రో పిల్లర్ ని ఢీకొట్టిందని స్థానికులు చెబుతున్నారు. మృతుల్లో ఒకరు తిరుమలగిరికి చెందిన యువకుడిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సోమవారం అర్థరాత్రి ఆ యువకులు బైక్ పై షికారు కోసం రాగా.. ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.

PREV
click me!

Recommended Stories

Telangana : మూడో విడత పంచాయతీ పోలింగ్ ప్రారంభం
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!