శ్రీశైలం-హైదరాబాద్‌ హైవేపై ఘోర ప్రమాదం: ఇద్దరు మృతి

Published : Nov 25, 2018, 10:14 AM IST
శ్రీశైలం-హైదరాబాద్‌ హైవేపై ఘోర ప్రమాదం: ఇద్దరు మృతి

సారాంశం

 శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆదివారం కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది.  ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న  ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. 


శ్రీశైలం-హైదరాబాద్‌ హైవే రహదారిపై ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు  అక్కడికక్కడే మృతిచెందారు. 

పూర్తి వివరాల్లోకి వెళితే..నాగర్‌కర్నూల్‌ జిల్లా ఉప్పునుంతల మండలం వెల్టూరు సమీపంలోగల శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆదివారం కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది.  ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న  ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. 

కారులోని వ్యక్తి అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. విషయం తెలుసుకున్న  పోలీసులు హూటాహుటిన ప్రమాద స్థలికి చేరుకున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
Hyderabad: ఇది పూర్త‌యితే హైద‌రాబాద్‌లో దేశంలో టాప్ సిటీ కావ‌డం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్‌