తెలంగాణలో కొత్తగా 27 కేసులు, ఒకరి మృతి: మొత్తం కేసులు 970, మృతులు 25

By telugu teamFirst Published Apr 23, 2020, 6:38 PM IST
Highlights

తెలంగాణలో తాజాగా గత 24 గంటల్లో కొత్తగా 27 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక మరణం కూడా సంభవించింది. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తెలంగాణలో 970కి చేరుకుంది.

హైదరాబాద్: తెలంగాణలో తాజాగా గత 24 గంటల్లో కొత్తగా 27 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కోవిడ్ -19 పాజిటివ్ కేసుల సంఖ్య 970కి చేరుకుంది. తాజాగా రాష్ట్రంలో ఒకరు మరణించారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 25కు చేరుకుంది. ఇప్పటి వరకు ఆస్పత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జ్ అయినవాళ్ల సంఖ్య 262 ఉంది. 

గత 24 గంటల్లో నమోదైన 27 కేసుల్లో హైదరాబాదులోనే 13 కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలతో పోలిస్తే తెలంగాణలో మరణాల సంఖ్య తక్కువగా ఉందని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గురువారం మీడియా సమావేశంలో వెల్లడించారు. కోవిడ్ -19 రోగులకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రులపై సమీక్ష చేస్తున్నామని ఆయన చెప్పారు.  

కొత్త కేసుల కంటైన్మెంట్ జోన్ల నుంచి మాత్రమే వస్తున్నాయని, ఇతర ప్రాంతాల నుంచి రావడం లేదని ఆయన చెప్పారు గాంధీ ఆస్పత్రిలో మెరుగైన చికిత్స కోసం చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.  

హైదరాబాదులోని ఆసిఫ్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో 47 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు మృత్యువాత పడ్డారు. కంటైన్మెంట్లను ఏర్పాటు చేసి లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు. హైదరాబాదులోని మొత్తం కేసుల్లో 52 శాతం ఇక్కడి నుంచే వచ్చినట్లు చెబుతున్నారు.

click me!