2018 క్రైమ్ రిపోర్ట్:సంచలన పరువు హత్యలు, ఆత్మహత్యలు

By Arun Kumar PFirst Published Dec 31, 2018, 3:17 PM IST
Highlights

తెలంగాణలో 2018 సంవత్సరంలో ఘోరమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా పరువు కోసం జరిగిన హత్యలు సంచలనం సృష్టించాయి. తన పిల్లల ప్రేమ పెళ్లి, కులాంతర వివాహాలు ఇష్టంలేక తల్లిదండ్రులు దారుణాలకు పాల్పడ్డారు. కొందరు కుటుంబసభ్యులు తమ ఇంటి ఆడపిల్లను ప్రేమించిన యువకులను హత్య చేయగా, మరికొందరయితే ఏకంగా తమ వారినే దారుణంగా హతమార్చారు. ఇలాంటి దారుణాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేకం జరిగాయి.  

తెలంగాణలో 2018 సంవత్సరంలో ఘోరమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా పరువు కోసం జరిగిన హత్చలు సంచలనం సృష్టించాయి. తన పిల్లల ప్రేమ పెళ్లి, కులాంతర వివాహాలు ఇష్టంలేక తల్లిదండ్రులు దారుణాలకు పాల్పడ్డారు. కొందరు కుటుంబసభ్యులు తమ ఇంటి ఆడపిల్లను ప్రేమించిన యువకులను హత్య చేయగా, మరికొందరయితే ఏకంగా తమ వారినే దారుణంగా హతమార్చారు. ఇలాంటి దారుణాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేకం జరిగాయి. అలా సంచలనం సృష్టించిన పరువు హత్యలు ఇవే.

ప్రణయ్ హత్య  

2018 లో నల్గొండ జిల్లాలో జరిగిన ఓ పరువు హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మిర్యాలగూడ పట్టణానికి చెందిన ప్రణయ్ అనే యువకున్ని ప్రేమ వివాహం బలితీసుకొంది. తన క్లాస్ మేట్  అమృత వర్షిణిని ప్రణయ్ ప్రేమించి పెళ్లి చేసుకొవడమే అతడి మృతికి కారణమయ్యింది. అమృత తండ్రి తనకు ఇష్టం లేకుండా తన కూతురిని పెళ్లి చేసుకున్నాడన్న ర=కోపంతో ప్రణయ్ ని అతి దారుణంగా హత్య చేయించాడు. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. వేరు వేరే కుటుంబాలకు చెందిన ప్రణయ్, అమృతలు కులాంతర వివాహం చేసుకున్నారు. వీరి వివాహానికి ప్రణయ్ తల్లిదండ్రులు ఒప్పుకున్నప్పటికి, అమృత తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఈ పెళ్లి సమయంలోనే ఇరు కుటుంబాల మధ్య పెద్ద గొడవలు జరిగాయి. దీంతో ప్రణయ్ పై కోపాన్ని పెంచుకున్న అమృత తండ్రి మారుతిరావు కిరాయి హంతకులకు రూ.10లక్షలు సుఫారీ ఇచ్చి దారుణంగా హత్య చేయించాడు. దీంతో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.

దీనిపై విచారణ జరిపిన పోలీసులు  ప్రణయ్ హత్యకు కారణం కులాంతర వివాహమేనని, ప్రణయ్ భార్య అమృత తండ్రి తిరునగరి మారుతీరావు ఈ హత్య చేయించాడని గుర్తించారు. దీంతో ఈ హత్యకు సంబంధమున్న మొహమ్మద్ బారీ, అస్గర్ అలీ, సుభాశ్ శర్మ, మారుతీరావు తమ్ముడు శ్రవణ్‌, డ్రైవర్ సముద్రాల శివగౌడ్‌ అరెస్ట్ చేశారు. 


ఎర్రగడ్డ పరువు హత్య 

మిర్యాలగూడ ప్రణయ్ హత్య తర్వాత ఆ స్థాయిలోనే హైదరాబాద్ ఎర్రగడ్డ పరువు హత్య సంచలనం రేపింది. నడి రోడ్డుపై తన కూతురు, అల్లుడిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేసి హత్యకు ప్రయత్నించాడు. హైదరాబాద్ నడిబొడ్డున, పట్టపగలే అందరూ చూస్తుండగా ఈ ఘటన జరగడంతో తీవ్ర కలకలం రేగింది. 

ఈ దారుణానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కూకట్‌పల్లికి చెందిన సందీప్ అనే యువకుడు ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చదివేవాడు. తన వ్యక్తిగత ఖర్చుల కోసం సాయంత్రం సమయంలో ఓ బిర్యానీ సెంటర్‌లో పనిచేసేవాడు. ఈ క్రమంలో సనత్‌నగర్‌లో డిగ్రీ చదువుతున్న మాధవి అనే యువతితో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. 

అయితే వీరి కులాలు వేరు కావడంతో కులాలు వేరు కావడంతో ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో పెద్దలను ఎదిరించి ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. దీంతో మాధవి తండ్రి మనోహరాచారి వీరిపై కక్ష పెంచుకున్నాడు. దీంతో ప్రేమజంటను నమ్మించి కలవాలని చెప్పి ఎర్రగడ్డ ప్రాంతానికి రమన్నాడు. అక్కడికి వచ్చిన వారిపై కత్తితో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో సందీప్, మాధవి తీవ్రంగా గాయపడినప్పటికి మెరుగైన వైద్యం అందడంతో ప్రాణాలతో బయటపడ్డారు.  

 

పాతబస్తీలో దారుణం

హైదరాబాద్ పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను తననుంచి దూరం చేశారన్న మనస్తాపంతో ఓ యువకుడు ఆత‍్మహత్యాయత్నానికి పాల్పడగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.  

సంతోష్‌ నగర్‌ ప్రాంతానికి చెందిన రక్షపురంకు చెందిన చిట్టిపాక శ్రీకాంత్‌ అనే యువకుడు మూడు సంవత్సరాల క్రితం ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆ అమ్మాయి తల్లిదండ్రులు అతన్ని బెదిరించి బలవంతంగా భార్యను తీసుకెళ్లిపోవటంతో మనస్తాపానికి గురయ్యాడు.ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య దూరమవటంతో శ్రీకాంత్‌ భరించలేకపోయాడు. ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  మంటల్లో కాలి తీవ్రంగా గాయపడిన అతన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.  కాగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీకాంత్ మృతి చెందాడు. 


పెళ్ళి చేస్తామని నమ్మించి దారుణ హత్య... 
 
కరీంనగర్ జిల్లాలో 2018 సంవత్సరంలో దారుణం చోటుచేసుకుంది. శంకరపట్నం మండలం తాటికల్ లో గడ్డి కుమార్ అనే యువకుడు ఓ యువతిని ప్రేమించినందుకు అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. 

 ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తమ గ్రామ సమీపంలోని వంకాయల గూడెం గ్రామానికి చెందిన ఓ యువతి, కుమార్ లు ప్రేమించుకున్నారు. దవీరి ప్రేమ విషయం ఇరువురి ఇండ్లలో తేలియడంతో పెద్ద గొడవలయ్యాయి.  తమ అమ్మాయిని మర్చిపోవాలని కుమార్ ను బెదిరించారు.  ఇలా గొడవలు జరుగుతున్న సమయంలోనే కుమార్ అనుమానాస్పదంగా చనిపోయాడు.  చివరకు ఇతన్ని యువతి కుటుంబ సభ్యులే చంపినట్లు నిర్ధారణ అయ్యింది. 


జయశ్రీ ఆత్మహత్య

ప్రేమించి పెళ్ళి చేసుకున్న వాడే వరకట్నం  కోసం వేధించడంతో తట్టుకోలేక ఓ ఎంబిబిఎస్ డాక్టర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

ఆల్వాల్ లోని వెస్ట్ వెంకటాపురానికి చెందిన గంగిశెట్టి కార్తీక్, సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన జయశ్రీ చదువుకునే సయమంలో ప్రేమించుకున్నారు. అయితే వీరి ప్రేమకు పెద్దలు ఒప్పుకోకపోయినా వారిని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి సమయంలో జయశ్రీ తండ్రి రూ.25 లక్షల నగదు, 45 తులాల బంగారు నగలు, 2 కిలోల వెండి ఆభరణాలను కార్తీక్ కు కట్నంగా ఇచ్చాడు.

అయితే పెళ్ళి తర్వాత కొద్ది రోజులు హాయిగా సాగిన వీరి సంసారంలో మెల్లమెల్లగా గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో కార్తీక్ భార్య జయశ్రీని అదనపు కట్నం కోసం వేధించడం ప్రారంభించాడు. అదనపు కట్నం తేవాలని ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే ఇబ్బందులకు గురిచేయడంతో మనస్థాపం చెందిన జయశ్రీ ఆత్మహత్య చేసుకుంది.  

అనురాధ దారుణ హత్య

మంచిర్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకొంది.  ప్రేమ వివాహం చేసుకొందని కూతురిని చంపి మృతదేహన్ని దగ్దం చేశారు కుటుంబ సభ్యులు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 

ఈ దారుణానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. జన్నారం మండలం కలమడుగుకు చెందిన అనురాధ, లక్ష్మణ్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆ జంట పెద్దలను ఎదిరించి ఈ నెల 3న హైదరాబాద్‌లోని ఆర్యసమాజంలో వివాహం చేసుకున్నారు. అనురాధ కుటుంబం కంటే లక్ష్మణ్ తక్కువ కులానికి చెందినవాడు. దీంతో వివాహం జరిగినప్పటి నుంచి అనురాధ కుటుంబసభ్యులు కొద్దిరోజులుగా భార్యాభర్తలను వెంబడిస్తున్నారు. ప్రేమ వివాహం సహించని తల్లిదండ్రులు ఆమెపై కక్ష పెంచుకున్నారు. కులం తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకుందని అనురాధపై పగ పెంచుకున్నారు.

అయితే కొద్ది కోజుల తర్వాత నూతన దంపతులు కలమడుగుకు చేరుకున్నారు. లక్ష్మణ్ ఇంటికి వచ్చిన అనురాధను ఆమె తల్లిదండ్రులు ఇంటికి పిలిపించారు. ప్రేమగా పిలవడంతో వారిని నమ్మి అనురాధ పుట్టింటికి వెళ్లింది. దీంతో అనురాధ  తండ్రి సత్తయ్య, సోదరుడు మహేష్ అనురాధ చితకబాదారు. ఈ దెబ్బలు తాకలేక అనురాధ మృతి చెందినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె శవాన్ని తమ స్వంత పొలంలో సజీవ దహనం చేశారు.  

ఏడాది చివర్లో మరో పరువు హత్య

 తెలంగాణలో మరో పరువు హత్య జరిగింది. సికింద్రాబాదులోని తిరుమలగిరిలో ఈ హత్య చోటు చేసుకుంది. నందకిషోర్ అనే యువకుడిని భార్య తరుఫుబంధువులు శనివారం అర్ధరాత్రి దారుణంగా హత్య చేశారు.. 

నాలుగేళ్ళ క్రితం తిరుమలగిరికి చెందిన ఓ యవతిని నందకిషోర్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే, ఈ వివాహం యువతి కుటుంబ సభ్యులకు నచ్చలేదు. నందకిశోర్ పెళ్లి చేసుకున్న యువతిది మరో కులం. 

నమ్మించి నందకిషోర్‌ను యువతి ఇంటికి బంధువులు పిలిపించారు. అతనికి మద్యం తాగించారు. ఆ తర్వాత బండరాళ్లతో కొట్టి చంపేశారు. సమాచారం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

click me!