వింధ్య ఆర్గానిక్స్ లో పేలుడు: రియాక్టర్ పేలడం వల్లే, 20 మందికి గాయాలు

Published : Dec 12, 2020, 03:19 PM ISTUpdated : Dec 12, 2020, 03:28 PM IST
వింధ్య ఆర్గానిక్స్ లో పేలుడు: రియాక్టర్ పేలడం వల్లే, 20 మందికి గాయాలు

సారాంశం

బొల్లారం పారిశ్రామికవాడలోని వింధ్య ఆర్గానిక్ పరిశ్రమలో చెలరేగిన మంటల్లో 20 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. రియాక్టర్ పేలడం వల్ల ఈ ప్రమాదం సంభవించింది.

సంగారెడ్డి: బొల్లారం పారిశ్రామికవాడలోని వింధ్య అర్గానిక్స్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో 20 మంది కార్మికులు గాయపడ్డారు. ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పరిశ్రమలో మూడు రియాక్టర్లు ఉన్నాయి. వాటిలో ఓ రియాక్టర్ పేలడంతో ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. 

ప్రమాద సమయంలో పరిశ్రమలో ఎంత మంది ఉన్నారనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే కార్మికులు భయంతో పరుగులు తీశారు. మంటలు భారీగా ఎగిసిపడడంతో పాటు దట్టంగా పొగలు వ్యాపించాయి. దాదాపు 20 కిలోమీటర్ల దూరంలోనే పరిశ్రమకు చుట్టుపక్కల ట్రాఫిక్ ను ఆపేశారు. 

వ్ెధేయ అర్గానిక్స్ లో ఇంకా మంటలు ఎగిసిపడుతున్నాయి. నాలుగు ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నాయి. కార్మికులు అందరూ పరిశ్రమలోనే చిక్కుకున్నట్లు తెలుస్తోంది. శ్వాస ఆడకు కార్మికులు గిలగిలా కొట్టుకున్నారు. మంటలు ఆర్పిన తర్వాత ఇంకా ఎవరైనా లోపల చిక్కకున్నారా అనే విషయం తెలుస్తుంంది. మంటలు అదుపులోకి వస్తున్నప్పటికీ పొగ మాత్రం అదుపులోకి రావడం లేదు. 

తెలంగాణలోని సంగారెడ్డి ఐడీఎ బొల్లారం పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. వింధ్య ఆర్గానిక్స్ పరిశ్రమలో పేలుళ్లు సంభవించాయి. దీంతో పెద్ద యెత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు మంటల్లో పలువురు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Powerful Speech: పూలే దంపతుల విగ్రహావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్
సైబర్ మోసాలపై అలర్ట్ చేసిన నాగార్జున సూపర్ స్పీచ్ | Akkineni Nagarjuna Cyber Awareness Programme