కరోనా ఎఫెక్ట్: హైదరాబాద్ నుంచి అమెరికా, దుబాయికి స్పెషల్ విమానాలు

By telugu news team  |  First Published Apr 23, 2020, 7:56 AM IST

దీనిలో భాగంగా  హైదరాబాద్ నుంచి కొందరు అమెరికా మరియు UAE జాతీయులను వారి స్వదేశానికి తరలించేందుకు వచ్చిన రెండు ప్రత్యేక విమానాలు హైదరాబాద్ విమానాశ్రయంలో దిగాయి. 


ప్రపంచం మొత్తం కోవిడ్-19 మహమ్మరి బారిన చిక్కుకున్న ఇలాంటి విపత్కర సమయంలో, భారతదేశం మొత్తం లాక్ డౌన్‌లో ఉన్న సందర్భంలో, కోవిడ్-19 రిలీఫ్ మరియు తరలింపు విమానాలను హ్యాండిల్ చేస్తూ GMR ఆధ్వర్యంలోని హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం భారతదేశంలో చిక్కుకుపోయిన ఇతర దేశాల వారిని సరిహద్దులు దాటిస్తూ జాతికి తన వంతు సేవలను అందిస్తోంది. 


దీనిలో భాగంగా  హైదరాబాద్ నుంచి కొందరు అమెరికా మరియు UAE జాతీయులను వారి స్వదేశానికి తరలించేందుకు వచ్చిన రెండు ప్రత్యేక విమానాలు హైదరాబాద్ విమానాశ్రయంలో దిగాయి. 

Latest Videos

undefined


అమెరికా జాతీయుల కోసం ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం:

వీటిలో మొదటి ఎయిర్ ఇండియా విమానం AI 1839(అరైవల్స్)/ AI 1840(డిపార్చర్) సాయంత్రం 5.50 గంటల సమయంలో ఢిల్లీ నుండి హైదరాబాద్‌లో దిగింది. ఈ విమానం 100 మంది అమెరికా జాతీయులతో తిరిగి రాత్రి 7.23 గంటల సమయంలో ఢిల్లీకి తిరిగి వెళ్లింది. వీరిని ఢిల్లీ నుంచి యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ద్వారా తిరిగి అమెరికాకు పంపుతారు. 


UAE జాతీయుల కోసం ఎయిర్ అరేబియా ప్రత్యేక విమానం
:

తెలంగాణలో చిక్కుకుపోయిన 72  మంది UAE జాతీయులను తరలించేందుకు వచ్చిన మరో విమానం ఎయిర్ అరేబియా G9 426 మొదట షార్జా నుంచి కొచ్చిన్‌కు వచ్చి, అక్కడి నుంచి రాత్రి 7.35 గంటల సమయంలో హైదరాబాద్ విమానాశ్రయంలో దిగి, UAE జాతీయులతో రాత్రి 9.01 గంటల సమయంలో షార్జాకు తిరిగి వెళ్లింది.  


అమెరికా కాన్సులేట్, UAE కాన్సులేట్ మరియు తెలంగాణ ప్రభుత్వ సమన్వయంతో ఈ అమెరికా, UAE జాతీయులను పూర్తిగా శానిటైజ్ చేసిన ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్‌ ద్వారా వారి స్వదేశాలకు వెళ్లే ఫ్లయిట్స్‌లో పంపడం జరిగింది. వీరు సాయంత్రం 3-4 గంటల మధ్యన హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. 
టెర్మినల్‌లో ప్రవేశించే ముందు ప్రయాణికులందరికీ కోవిడ్-19 థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించారు. 

స్పెషల్ స్క్రీనింగ్, పలు భద్రతా చర్యల అనంతరం, తగిన భౌతిక దూరాన్ని పాటిస్తూ వారు ప్యాసింజర్ ప్రాసెసింగ్ పాయింట్స్ ను దాటుకుని విమానంలోకి వెళ్లారు.  
ఈ అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి, చిక్కుకుపోయిన ప్రయాణికులను తరలించడానికి GHIAL కు చెందిన టెర్మినల్ ఆపరేషన్స్ సిబ్బంది, ఎయిర్ సైడ్ ఆపరేషన్స్, AOCC, ATC, ల్యాండ్ సైడ్ సెక్యూరిటీ, సీ.ఐ.ఎస్.ఎఫ్., ఇమిగ్రేషన్, కస్టమ్స్, APHO (ఎయిర్ పోర్ట్ హెల్త్ ఆఫీసర్స్), ఎయిర్ లైన్ గ్రౌండ్ హ్యాండ్లర్లు, ARFF (ఎయిర్ పోర్ట్ రెస్క్యూ అండ్ ఫైర్ ఫైటింగ్) సేవలు RAXA సెక్యూరిటీ, ట్రాలీ ఆపరేటర్లు, హౌస్ కీపింగ్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారు.  


ఇప్పటి వరకు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 10 ఎవాక్యుయేషన్ ఫ్లయిట్స్ ద్వారా 750 మందికి పైగా అమెరికా, జర్మనీ, UK  మరియు UAE లాంటి వివిధ దేశాలకు చెందిన వారిని తరలించారు. 
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఒకవైపు నిరంతరం తరలింపు విమానాలను హ్యాండిల్ చేస్తూనే మరో వైపు సప్లై చెయిన్ విమానాలు నడిచేందుకు నిరంతరం సహకరిస్తూ, దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల సప్లై చెయిన్ ఎలాంటి ఆటంకాలూ లేకుండా కొనసాగేందుకు కృషి చేస్తోంది. 

గ్రౌండ్ హ్యండ్లరు, ఫార్వర్డర్లు, కస్టమ్స్ హౌస్ ఏజెంట్లు, రెగ్యులేటర్లు, రాష్ట్ర పోలీసులు, కార్గో ట్రేడ్ అసోసియేషన్లతో కలిసి అత్యవసర వస్తువులైన ఔషధాలు, వ్యాక్సిన్లు, మెడికల్ ఎక్విప్ మెంట్, ఫార్మా ముడి పదార్థాలు, రక్షణ పరికరాలు, బ్యాంకు సంబంధిత వస్తువులు నిరంతరం రవాణా కొనసాగేందుకు కృషి చేస్తోంది.

click me!