కలుషిత నీరు తాగి.. సికింద్రాబాద్ లోని చింతబావి బస్తీలో 150 మందికి అస్వస్థత..

Published : Apr 27, 2023, 01:25 PM IST
కలుషిత నీరు తాగి.. సికింద్రాబాద్ లోని చింతబావి బస్తీలో 150 మందికి అస్వస్థత..

సారాంశం

కలుషిత నీరు తాగి సికింద్రాబాద్ లోని ఓ బస్తీలో 150మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలతో ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. 

సికింద్రాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కలుషిత నీరు తాగి 150మంది అస్వస్థతకు గురైన ఘటన వెలుగు చూసింది.   సికింద్రాబాద్ లోని చింత బావి బస్తీలో 150 మందికి తీవ్ర అస్వస్థత పాలయ్యారు. ఈ ఏరియాలో గత మూడు రోజులుగా కలిసిత నీరు సరఫరా అవుతోంది. వేరే గత్యంతరం లేక ఈ నీరే తాగాల్సి రావడంతో బస్తివాసులు ఆ నీటిని తాగి అస్వస్థతకు గురయ్యారు. 

వాంతులు, విరోచనాలలో ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. దీనిమీద ఫిర్యాదులో అందడంతో అప్రమత్తమైన వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వారు దీని మీద చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్