తెలంగాణలో మరో 15 కేసులు... 45 మంది డిశ్చార్జ్: 1,122కి చేరిన సంఖ్య

By Siva Kodati  |  First Published May 7, 2020, 9:29 PM IST

తెలంగాణలో గురువారం కూడా తక్కువ సంఖ్యలోనే కరోనా కేసులు నమోదయ్యాయి. ఇవాళ రాష్ట్రంలో 15 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.


తెలంగాణలో గురువారం కూడా తక్కువ సంఖ్యలోనే కరోనా కేసులు నమోదయ్యాయి. ఇవాళ రాష్ట్రంలో 15 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 1,122కి చేరుకుంది. గురువారం కరోనా నుంచి 45 మంది బాధితులు డిశ్చార్జ్ కావడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 693కి చేరింది.

మరో 400 మంది బాధితులు ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా బారినపడి ఇప్పటి వరకు 29 మంది ప్రాణాలు కోల్పోయారు. గురువారం నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే ముగ్గురు వలస కూలీలకు కోవిడ్ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 

Latest Videos

undefined

Also Read:హైదరాబాద్‌ను దిగ్బంధించండి... వైరస్ అంతుచూడండి: కేసీఆర్

కాగా భారతదేశంలో గురువారం నాటికి 52,952 మందికి కోవిడ్ సోకగా, వీరిలో 1,783 మంది మరణించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం బాధితుల్లో 15,267 మంది కోలుకుని డిశ్చార్జ్  అవ్వగా మరో 35,902 మంది చికిత్స పొందుతున్నారు. 

మరోవైపు తెలంగాణలో లాక్‌డౌన్‌ను మే 29 వరకు పొడిగిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ముందు నుంచి పకడ్బందీగా చర్యలు చేపట్టడం వల్ల వైరస్‌ను అదుపు చేసి దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచామని కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్ నుంచి నేర్చుకుని మిగిలిన ప్రాంతాల్లో అమలు చేశామని ఆయన చెప్పారు.

దేశంలో మరణాల రేటు 3.37 శాతంగా ఉంటే తెలంగాణలో 2.64 శాతంగా ఉందని ముఖ్యమంత్రి వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 42.7 శాతంగా ఉందని.. కరోనా కట్టడికి కృషి చేసిన అధికారులు, నేతలు, సిబ్బందిని కేసీఆర్ అభినందించారు.

Also Read:హైద్రాబాద్ నుండి నల్గొండకు కాలినడకన అంధురాలు: మానవత్వం చూపిన పోలీసులు

కరోనాను నియంత్రించే వ్యాక్సిన్‌ కోసం సీరియస్‌గా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆగస్టు, సెప్టెంబర్ నాటికి అది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సీఎం వెల్లడించారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని.. మనదేశంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో భయంకరంగా చనిపోతున్నారని కేసీఆర్ గుర్తుచేశారు.

click me!