పార్టీ కార్యాలయాల్లో స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు

Published : Aug 15, 2018, 12:43 PM ISTUpdated : Sep 09, 2018, 01:35 PM IST
పార్టీ కార్యాలయాల్లో స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు

సారాంశం

72వ స్వాతంత్రదినోత్సవ వేడుకలను పలు పార్టీ కార్యాలయాల్లో బుధవారం నాడు ఘనంగా నిర్వహించారు.స్వాతంత్ర్యం కోసం  అమరులు చేసిన పోరాటాన్ని పలువురు కొనియాడారు.


హైదరాబాద్: 72వ స్వాతంత్రదినోత్సవ వేడుకలను పలు పార్టీ కార్యాలయాల్లో బుధవారం నాడు ఘనంగా నిర్వహించారు.స్వాతంత్ర్యం కోసం  అమరులు చేసిన పోరాటాన్ని పలువురు కొనియాడారు.

సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.  ఆ తర్వాత  ఆయన గోల్కోండ కోటలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

టీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో  రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఎన్టీఆర్ ట్రస్టుభవన్‌లో టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు  ఎల్. రమణ  జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో  ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 


 

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?