ఓటరు కార్డు లేకపోయినా.. ఈ 13 కార్డుల్లో ఏదైనా ఒకటి ఉంటే చాలు

By sivanagaprasad KodatiFirst Published Dec 6, 2018, 7:54 PM IST
Highlights

పాత వారిలో చాలా మందికి ఓటరు గుర్తింపు కార్డులు లేవు.. దీంతో ఓటు వేయడానికి తమను అనుమతిస్తారో లేదోనని జనం ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ వారి భయాన్ని పొగొట్టారు. 

మరికొన్ని గంటల్లో తెలంగాణ ఎన్నికలు ప్రారంభంకానున్నాయి. ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే కొత్తగా ఓటర్లుగా నమోదు చేయించుకున్నవారితో పాటు పాత వారిలో చాలా మందికి ఓటరు గుర్తింపు కార్డులు లేవు.. దీంతో ఓటు వేయడానికి తమను అనుమతిస్తారో లేదోనని జనం ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ వారి భయాన్ని పొగొట్టారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన ఓటరు కార్డు లేనప్పటికీ ప్రభుత్వం గుర్తించిన 13 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి చూపించి ఓటుహక్కు వినియోగించుకోవచ్చన్నారు. 

ఎన్నికల సంఘం గుర్తించిన గుర్తింపు కార్డులు:

1.పాస్ పోర్ట్

2.డ్రైవింగ్ లైసెన్స్

3.ఆధార్ కార్డు

4.ఉపాధి హామీ పథకం కార్డు

5.ఆరోగ్య బీమా కార్డు

6.పాన్ కార్డు

7.ప్రభుత్వ, ప్రభుత్వ రంగ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలలో పని చేస్తున్న ఉద్యోగులు ఐడి కార్డు చూపించి ఓటు వేయవచ్చు.

8.బ్యాంకు పాసు పుస్తకం

9. పోస్టాఫీస్ పాసు పుస్తకం

10.ఆర్ జీఐ జారీ చేసిన ఎన్ పీఆర్ స్మార్ట్ కార్డు

11.ఫోటోతో కూడిన పెన్షన్ డాక్యుమెంట్

12. ఈసీ జారీ చేసిన ఫోటోతో కూడిన ఓటరు స్లిప్పు

13. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల గుర్తింపు కార్డు


 

click me!