year end 2023: ఈ ఏడాదిలో ఎక్కువగా డిలేట్ చేసిన యాప్ ఏదంటే..

By Ashok kumar Sandra  |  First Published Dec 23, 2023, 7:43 PM IST

గత నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా వినియోగదారుల సంఖ్య 4.8 బిలియన్లను దాటింది. ప్రపంచంలోని చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు ప్రతిరోజూ 2 గంటల 24 నిమిషాలు సోషల్ మీడియాలో గడుపుతున్నారు. 
 


2023 సంవత్సరం ఇంకొన్ని రోజుల్లో ముగియబోతోంది. ఈ ఏడాదికి సంబంధించిన అనేక గణాంకాలు కూడా బయటకు వస్తున్నాయి.  2023లో అత్యధికంగా తొలగించబడిన సోషల్ మీడియా యాప్‌ల లిస్ట్ కూడా వచ్చింది. సోషల్ మీడియా వినియోగదారుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. గత నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా వినియోగదారుల సంఖ్య 4.8 బిలియన్లను దాటింది.  ప్రపంచంలోని చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు ప్రతిరోజూ 2 గంటల 24 నిమిషాలు సోషల్ మీడియాలో గడుపుతున్నారు.

2023లో అత్యధికంగా తొలగించబడిన యాప్‌లు
అమెరికన్ టెక్ సంస్థ TRG డేటాసెంటర్ ఒక నివేదికను విడుదల చేసింది, ఇందులో ఈ సంవత్సరం అత్యధికంగా తొలగించబడిన(deleted apps) యాప్‌ల గురించి సమాచారం అందించింది. సంస్థ ప్రకారం, ప్రారంభించిన 24 గంటల్లోనే 100 మిలియన్ల వినియోగదారులను సంపాదించిన Meta's Thread యాప్ 5 రోజుల్లో 80 శాతం మంది యూజర్లను కోల్పోయింది. నివేదిక ప్రకారం, చాలా యాప్‌లు భారీ నష్టాన్ని చవిచూశాయి.

Latest Videos

 అత్యధికంగా తొలగించబడిన యాప్
నివేదిక ప్రకారం, ప్రపంచంలోని దాదాపు 10 లక్షల మంది ప్రజలు ఇంటర్నెట్‌లో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ తొలగించే మార్గాల కోసం వెతికారు. ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ను 10,20,000 మందికి పైగా యూజర్లు  తొలగించారు. 
 
అత్యధికంగా తొలగించబడిన యాప్‌ల లిస్ట్ లో రెండవ స్థానంలో స్నాప్‌చాట్ ఉంది, దీనిని 1,28,500 మంది యూజర్లు తొలగించారు. దీని తర్వాత X (ట్విట్టర్), టెలిగ్రామ్, Facebook, TikTok, YouTube, WhatsApp అండ్ WeChat పేర్లు ఉన్నాయి. 49,000 మంది ఫేస్‌బుక్ యాప్‌ను తొలగించారు. వాట్సాప్‌ను తొలగించిన యూజర్ల  సంఖ్య 4,950.

click me!