త్వరలో అదిరే ఫీచర్లతో మార్కెట్లోకి రెడ్‌మి నోట్‌ 6 ప్రో

By sivanagaprasad kodati  |  First Published Nov 21, 2018, 7:57 AM IST

స్మార్ట్ ఫోన్ల వినియోగదారులకు అత్యాధునిక ఫీచర్లతో అందుబాటులోకి తేవడంలో ముందున్న చైనా మేజర్ షావోమీ తాజాగా ‘రెడ్ మీ నోట్ 6 ప్రో’ను అందుబాటులోకి తెచ్చింది. రెడ్ మీ నోట్ 5 ప్రోకు కొనసాగింపుగా ఈ ఫోన్ మరో రెండు రోజుల్లో మార్కెట్లో అందుబాటులోకి రానున్నది. 


తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లను పొందుపరుస్తూ చైనా మొబైల్‌ తయారీదారు షావోమీ అంతర్జాతీయంగా.. ప్రత్యేకించి భారతీయ వినియోగదారుల ఆదరణను పొందింది. ఈ సంవత్సరం మొదట్లో వచ్చిన రెడ్‌మి నోట్‌ 5ప్రో కి కొనసాగింపుగా రెడ్‌మి సిరీస్‌లో మరో అద్భుతమైన ఫోన్‌  ‘రెడ్‌మి నోట్‌ 6ప్రో’ ను తీసుకొస్తోంది.

ముందూవెనుక నాలుగు కెమెరాలతో ఈ ఫోన్‌ను త్వరలో మార్కెట్‌లో విడుదల చేయనుంది. తద్వారా దక్షిణ కొరియా స్మార్ట్ ఫోన్ల మేజర్ శామ్ సంగ్ ఏ9 గెలాక్సీతో పోటీ పడనున్నది. ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా దీనిని మార్కెట్‌లో రిలీజ్‌ చేయనున్నారు.

Latest Videos

undefined

వినియోగదారులకు ఉపయోగకరమైన కెమెరాలతోపాటు పవర్ ఫుల్ బడ్జెట్ ప్రాసెసర్, అందుబాటులో ధర కొనుగోలుదారుల మనస్సు దోచుకునే అంశాలు. ఈ ఫోన్ ద్వారా తీసే ఫోటోలు డీసెంట్‪గా కనిపిస్తాయి.

క్వాడ్ కెమెరా సెటప్ గల ఈ ఫోన్లో 20 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్ సెల్పీ కెమెరాలు, ఏఐ ఫేస్ అన్ లాక్ 4 ఎన్ 1 సూపర్ పిక్సెల్ కెమెరా అమర్చారు. ఇక 12 మెగా పిక్సెల్స్, ఐదు మెగా పిక్సెల్ సెన్సార్లతో కూడి రేర్ కెమెరా సెటప్ యధాతథంగా ఉంటుంది. 

6.26 ఫుల్‌హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లేతోపాటు, 2280 x 1080 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌, స్నాప్‌డ్రాగన్‌ 636 ఆక్టా కోర్‌ ప్రాసెసర్‌, 3/4 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ  స్టోరేజ్‌ నుంచి 256 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం ఈ ఫోన్లలో లభిస్తుంది.

గత ఫోన్లకంటే పెద్దదిగా 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ దీని సొంతం. అదనంగా క్వాల్ కామ్ క్విక్ చార్జి 3.0 కూడా ఉంటుంది. ధర వివరాలు అధికారికంగా ఇంకా విడుదల కావాల్సి ఉంది. సుమారు రూ.15వేల నుంచి రూ.17 వేల లోపు ధరను నిర్ణయించే అవకాశం ఉందని అంచనా.

షావోమీ గిన్నిస్ రికార్డు
చైనీస్ మొబైల్ మేకర్ షావోమీ గిన్నిస్ రికార్డు సృష్టించింది. భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఒక్క రోజులోనే ఏకంగా 500 రిటైల్ స్టోర్లు ప్రారంభించినందుకు గాను ఈ రికార్డు సొంతం చేసుకుంది. ఎంఐ స్టోర్లుగా పిలిచే వీటిని అక్టోబర్ 29న ప్రారంభించింది.

ఇవి ఇంచుమించు ‘ఎంఐ హోమ్స్’లానే ఉంటాయి. ఇవి ప్రస్తుతం మెట్రో నగరాల్లో మాత్రమే ఉన్నాయి. ‘ఎంఐ స్టోర్లు’ మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘‘ఒక్క రోజులోనే అత్యధిక రిటైల్ స్టోర్లు ప్రారంభించినందుకు షావోమీ గిన్నిస్ రికార్డులకెక్కింది.

2019 చివరి నాటికి 5 వేల ఎంఐ స్టోర్లు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఫలితంగా 15 వేల ఉద్యోగాలు లభిస్తాయి’’ అని షావోమీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ వైస్ ప్రెసిడెంట్ మనుకుమార్ జైన్ పేర్కొన్నారు.

click me!