4 కెమెరాల తొలి స్మార్ట్ ఫోన్ ‘శామ్‌సంగ్ గెలాక్సీ ఏ9’.. 22 నుంచి బుకింగ్స్

By sivanagaprasad kodati  |  First Published Nov 21, 2018, 7:51 AM IST

దక్షిణ కొరియా స్మార్ట్ ఫోన్ దిగ్గజం శామ్‌సంగ్ ప్రపంచంలోనే నాలుగు కెమెరాలతో కూడిన తొలి స్మార్ట్ ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది. పలు రకాల వసతులు గల ఈ స్మార్ట్ ఫోన్ ఆన్ లైన్ కొనుగోళ్లు 28 నుంచి, ఫ్రీ బుకింగ్స్ గురువారం నుంచి మొదలు కానున్నాయి. 
 


ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుండగా.. నూతన టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చే సంస్థల్లో ఎప్పుడూ ముందుండే దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ల దిగ్గజ సంస్థ శామ్‌సంగ్..

దేశీయ మార్కెట్లోకి నాలుగు కెమెరాలతో రూపొందించిన తొలి స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఏ9ను ప్రవేశపెట్టింది. ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో వెనుకవైపు నాలుగు కెమెరాలు కలిగిన తొలి స్మార్ట్‌ఫోన్ ఇదే.  దీన్ని ఆ కంపెనీ మంగళవారం భారత్‌లో శామ్ సంగ్ విడుదల చేసింది.

Latest Videos

undefined

వెనుక నాలుగు కెమెరాలతోపాటు ముందు వైపు అద్భుతమైన సెల్ఫీలు తీసుకునేందుకు వీలుగా 24 మెగాపిక్సల్‌ కెమెరాను అమర్చారు. ఫేస్‌ అన్‌లాక్‌ మరో ప్రత్యేకత. 6జీబీ/ 8జీబీ ర్యామ్‌తో వస్తున్న ఈ ఫోన్‌లో బిక్స్‌బీ వాయిస్‌ అసిస్టెంట్‌, శామ్‌సంగ్‌ పే, శామ్‌సంగ్‌ హెల్త్‌ వంటి వసతులు ఉన్నాయి.

6జీబీ ర్యామ్ గల గెలాక్సీ ఏ9 ప్రారంభ ధరను కంపెనీ రూ.36,990గా,  8జీబీ వేరియంట్‌ ధరను రూ.39,990గా పేర్కొంది. బబుల్‌గమ్‌ పింక్‌, కేవియర్‌ బ్లాక్‌, లేమండ్‌ బ్లూ కలర్స్‌లో లభ్యం కానుంది. ఎయిర్‌టెల్‌ స్టోర్‌, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, పేటీఎం మాల్‌, శామ్‌సంగ్‌ షాప్‌ వంటి ఆన్‌లైన్‌ స్టోర్లతో పాటు, ఆఫ్‌లైన్‌ స్టోర్లలో ఈ నెల 28 నుంచి లభించనున్నది.

ఈ మొబైల్‌ ప్రీ బుకింగ్స్ గురువారం నుంచి ప్రారంభిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డు ద్వారా ఏ9 కొనుగోలు చేసిన వారికి రూ.3వేలు క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ ఉంది. దీంతో పాటు ఎయిర్‌టెల్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌లో ఈఎంఐ వసతి ఉంది.

శామ్ సంగ్ గెలాక్సీ ఏ9 ఫోన్‌లో వెనుక వైపు 24+10+8+5 మెగాపిక్సల్స్‌ చొప్పున నాలుగు కెమెరాలు ఉంటాయి. 24 ఎంపీ ప్రధాన కెమెరాతో పాటు, 10 ఎంపీ టెలీఫొటో సెన్సార్‌, 8 ఎంపీ అల్ట్రావైడ్‌ సెన్సార్‌, 5 ఎంపీ డెప్త్‌ సెన్సార్‌గా ఉపయోగపడతాయి. ముందు వైపు 24 మెగాపిక్సల్‌ కెమెరాతో అద్భుతమైన సెల్ఫీలు తీసుకోవచ్చు. ఫేస్‌అన్‌లాక్‌ సదుపాయమూ ఉంది. 

ఆండ్రాయిడ్‌ 8.0 ఓరియో ఓఎస్‌తో పనిచేసే ఈ ఫోన్‌ 18:5:9 రేషియోలో 6.3 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ సూపర్‌ అమోల్డ్‌ డిస్‌ప్లేతో వస్తోంది. ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 660 ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌ను వినియోగించారు.

దీంతో పాటు 128 జీబీ అంతర్గత స్టోరేజీ ఉంటుంది. దీన్ని 512 జీబీ వరకు పెంచుకునే వీలు కూడా ది. యూఎస్‌బీ టైప్‌-సీ పోర్ట్‌, ఎన్‌ఎఫ్‌సీ, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్‌ జాక్‌ ఉన్నాయి. ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌తో పాటు 3,800 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది.

click me!