Poco F4 పేరుతో మరొక సరికొత్త స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్‌లో విడుదలైంది. 5Gకి సపోర్ట్ చేసే ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.. ధర ఎంతో ఇక్కడ తెలుసుకోండి.
స్మార్ట్‌ఫోన్ తయారీదారు పోకో తమ F సిరీస్‌లో మరొక స్మార్ట్‌ఫోన్‌ను చేర్చింది. Poco F4 పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది 5Gకి సపోర్ట్ చేసే ప్రీమియం స్మార్ట్‌ఫోన్. పోకో F సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు ఉత్తమమైన ఫీచర్లతో పాటు అద్భుతమైన పనితీరుకు ప్రసిద్ధి. తాజాగా వచ్చిన Poco F4 స్మార్ట్‌ఫోన్ కూడా మెరుగైన ఫీచర్లతో పాటు ప్రీమియం డిజైన్ తో కస్టమర్‌లను ఆకట్టుకునేలా ఉంది.
Poco F4 స్మార్ట్‌ఫోన్‌లో మధ్య-శ్రేణి ఫోన్‌ల కోసం రూపొందించిన ఫ్లాగ్‌షిప్-గ్రేడ్ చిప్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 870 SoCను సీపీయూగా ఇచ్చారు. డాల్బీ విజన్‌కు సపోర్ట్ చేసే 120Hz AMOLED డిస్‌ప్లే, డాల్బీ అట్మోస్ స్పీకర్లు, ట్రిపుల్ రియర్ కెమెరాలు మొదలైనవి ఇచ్చారు. మీరు రూ. 30 వేల బడ్జెట్ ధరలో మంచి ఫోన్ కోసం చూస్తుంటే Poco F4 5Gని పరిగణలోకి తీసుకోవచ్చు. ఈ ఫోన్ ఇటీవల లాంచ్ అయిన iQoo Neo 6కి పోటీగా ఉంటుంది. ఇంకా ఇందులో మంచి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి. ధర ఎంత..? తదితర వివరాలను ఇక్కడ పరిశీలించండి.
undefined
Poco F4 5G స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
- 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.67 అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లే
- 6 GB/8 GB RAM, 128GB/256 GB స్టోరేజ్ సామర్థ్యం
- స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్
- వెనకవైపు 64MP + 8MP+ 2MP ట్రిపుల్ కెమెరా సెటప్; ముందు భాగంలో 20 MP సెల్ఫీ షూటర్
- ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
- 4500 mAh బ్యాటరీ సామర్థ్యం, 67W ఫాస్ట్ ఛార్జర్.. కనెక్టివిటీ పరంగా Poco F4 5Gలో 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్ v5.2, GPS/ A-GPS, NFC, USB టైప్-C ఉన్నాయి.
- 6GB ర్యామ్, 128 ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర, రూ. 27,999
- 8 GB ర్యామ్, 128 ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర, రూ. 29,999
- 8 GB ర్యామ్, 256 ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర, రూ. 33,999. Poco F4 నెబ్యులా గ్రీన్, నైట్ బ్లాక్ అనే రెండు కలర్ ఛాయిస్‌లలో లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ జూన్ 27, 2022 నుండి కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది.