జియోమీ 48 మెగా పిక్సెల్స్ కెమెరా ఫోన్..జనవరిలో మార్కెట్లోకి

By sivanagaprasad kodatiFirst Published Dec 9, 2018, 3:48 PM IST
Highlights

48 మెగా పిక్సెల్స్ సామర్థ్యం గల స్మార్ట్ ఫోన్‌ను వచ్చే ఏడాది మార్కెట్లోకి విడుదల చేయనున్నది జియోమీ. గతంలో నోకియా మాదిరిగా తాజాగా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో ఫోన్లు ఆవిష్కరించే సంస్క్రుతి మళ్లీ మొదలైంది. ఈ క్రమంలోనే జియోమీ కొత్త మోడల్ ఆవిష్కరించబోతున్నది. 

పదేళ్ల క్రితం నోకియా తన మొబైల్స్‌లో కెమెరాలను అప్‌డేట్‌ చేస్తూ మొబైల్‌ మార్కెట్‌ను శాసించిన పరిస్థితులను చూశాం. గత కొద్ది నెలలుగా మార్కెట్లోకి రిలీజవుతున్న మొబైల్స్‌ ఫోన్లను గమనిస్తే ఈ ట్రెండ్‌ మళ్లీ ప్రారంభమైనట్లు అనిపిస్తోంది. తాజాగా  ప్రతీ మొబైల్‌ కంపెనీ తమ ఫ్లాగ్‌షిప్‌ ఫోన్లలో కెమెరాలను అప్‌డేట్‌ చేస్తున్నాయి. భారత స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో తనకంటూ ట్రెండ్ స్రుష్టించుకుంటున్నది జియోమీ. 

ఇదే క్రమంలో తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లను అందిస్తూ ఇండియాలో భారీ మార్కెట్‌ను సాధించిన చైనా మొబైల్‌ దిగ్గజం జియోమీ జనవరిలో బెస్ట్‌ కెమెరాతో దుమ్మురేపే మొబైల్‌ను అందుబాటులోకి తేనున్నది. 48 మెగాపిక్సెల్‌ భారీ కెమెరాతో ఈ ఫోన్‌ను తయారు చేయనున్నట్లు జియోమీ ప్రెసిడెంట్‌ లిన్‌ బిన్‌ తెలిపారు. ప్రముఖ చైనా టెక్నాలజీ వెబ్‌సైట్‌ వీబోలో ఈ మేరకు వార్త వెలువడింది.

తాను కొద్దివారాల పాటు ఈ మొబైల్‌ను ఉపయోగించినట్లు లిన్‌ తెలిపారు. 48 ఎంపీ సెన్సార్‌గా సోనీ ఐఎంఎక్స్‌ 586ని గానీ శాంసంగ్‌ ఐసోసెల్‌ బ్రైట్‌ జీఎం1ని గానీ అమర్చే అవకాశముందని తెలిపారు. సోనీ సెన్సార్‌ సూపర్‌ స్లో మోషన్‌ను సపోర్ట్‌ చేయడం లేదని, ఏదో ఒకటి చేసి దానినే అమర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపింది. 

48 కేఎం సామర్థ్యం గల కెమెరాలు రెండూ నాలుగు రెట్ల వరకూ దూరాన్ని జూమ్‌ ద్వారా స్పష్టంగా తీయగలవు. ఇప్పటివరకూ షావోమీ ఈ స్థాయి కెమెరా కలిగిన ఫోన్‌ తయారు చేయలేదు. ఇది ఎంతవరకు విజయం సాధించగలదో చూడాలంటే జనవరి వరకూ ఆగక తప్పదు. 

గతవారం హువావే 40 ఎంపీ కెమెరాతో ట్రిపుల్‌ రియర్‌ కెమెరా ఫోన్‌ రిలీజ్‌ చేసింది. 4-మెగా పిక్సెల్ సెన్సార్లతో మేట్ 20 ప్రో, పీ 20 ప్రో ఫోన్లను తయారు చేసింది. పిక్సెల్ బిన్నింగ్ సమస్య తలెత్తడంతో వాటిని టెక్నాలజీ సాయంతో పరిష్కరించింది హువావే. 

ఐఎంఎక్స్ 586ను వాడటం వల్ల మెగాపిక్సెల్ రేస్ లోకి జియోమీ రంగంలోకి దిగింది. ఒకవేళ ఇది సాధ్యమైతే వన్ ప్లస్, నోకియా, ఒప్పో, వివో వంటి సంస్థలు కూడా ఫాలో కానున్నాయి. 48 ఎంపీలతో మార్కెట్లోకి రానున్న షావోమీ ఫోన్ నూతనంగా క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ తయారు చేసిన 855 ప్రాసెసర్ సాయంతో తయారైంది. భారతదేశంలో జియోమీ అతిపెద్ద స్మార్ట్ ఫోన్ బ్రాండ్.

రెడ్ మీతో పోలిస్తే చివరి క్షణం వరకు భారత మార్కెట్లో ప్రవేశపెట్టే అంశం తెలీదు. ఇప్పడు కూడా మనీకి ప్రాధాన్యం ఇస్తూ తక్కువ రేటుకే గుడ్ కాంబినేషన్‌తో కూడిన హార్డ్ వేర్ తో స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంటుంది. అయితే భారత మార్కెట్లో ఎప్పుడు ఆవిష్కరిస్తారో తెలియని పరిస్థితి ఇది. 
 

click me!