ఈ యాప్ తో మీరు లైఫ్ టైం ఫ్రీగా మాట్లాడవచ్చు.. రిచార్జ్ ఇంకా డాటా కూడా అవసరం లేకుండా..

By asianet news telugu  |  First Published Mar 27, 2023, 1:49 PM IST

మీరు కూడా ఎలాంటి చార్జెస్ ఇంకా ఇంటర్నెట్ ఖర్చు లేకుండా లైఫ్ టైం ఉచితంగా కాల్స్ చేయాలనుకుంటే, మీ స్మార్ట్‌ఫోన్ లో Google Play స్టోర్‌కి వెళ్లండి. అక్కడ మీకు బ్లూటూత్ వాకీ టాకీ అనే యాప్ కనిపిస్తుంది. 


ఫ్రీ కాలింగ్ ప్రస్తుతం గతనికి సంబంధించిన అంశంగా మారింది. అన్ని టెలికాం కంపెనీలు ఫ్రీ కాలింగ్ ఇస్తూస్తున్నట్లు క్లెయిమ్ చేస్తాయి, అయితే దీని కోసం ఇప్పటికే మీ నుండి డబ్బు చార్జ్ చేసి ఉంటారు. ఇప్పుడు ఉచిత కాలింగ్  గురించి వింటే మీరు కూడా ఆశ్చర్యపోతారు, ఇది ఎలా సాధ్యమవుతుంది అని.. కానీ నిజం ఏమిటంటే మీరు ఒక యాప్ ద్వారా లైఫ్ టైం ఉచిత కాలింగ్ చేయవచ్చు ఇంకా అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే దీనికి ఇంటర్నెట్ కూడా అవసరం లేదు. అయితే ఈ యాప్ గురించి వివరంగా తెలుసుకుందాం...

మీరు కూడా ఎలాంటి చార్జెస్ ఇంకా ఇంటర్నెట్ ఖర్చు లేకుండా లైఫ్ టైం ఉచితంగా కాల్స్ చేయాలనుకుంటే, మీ స్మార్ట్‌ఫోన్ లో Google Play స్టోర్‌కి వెళ్లండి. అక్కడ మీకు బ్లూటూత్ వాకీ టాకీ అనే యాప్ కనిపిస్తుంది. ప్లే స్టోర్ నుండి బ్లూటూత్ వాకీ టాకీని డౌన్‌లోడ్ చేసి, మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయండి.

Latest Videos

undefined

యాప్‌ని ఓపెన్ చేసి ఇప్పుడు మీరు స్క్రీన్‌పై Wi-Fi అండ్ రిఫ్రెష్ బటన్‌ను చూస్తారు. ఇప్పుడు మీరు మాట్లాడాలనుకుంటున్న ఫ్రెండ్ ఫోన్‌లో ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి. మళ్ళీ మీ ఫోన్‌లో యాప్‌ని ఓపెన్ చేసి Wi-Fi అండ్ రిఫ్రెష్ బటన్‌పై క్లిక్ చేయండి.

బటన్‌ను క్లిక్ చేయడం ద్వారా, మీరు సమీపంలోని అన్ని బ్లూటూత్ డివైజెస్ లిస్ట్ పొందుతారు. ఇక్కడ మీరు మాట్లాడాలనుకుంటున్న ఫ్రెండ్ బ్లూటూత్ డివైజ్ పై నొక్కండి. ఫ్రెండ్ ఫోన్ ట్యాప్ చేయగానే మోగుతుంది.

బ్లూటూత్ డివైజ్ కలర్ రింగ్ అయిన తర్వాత ఎరుపు రంగులోకి మారుతుంది ఇంకా కాల్స్ వచ్చినపుడు ఆకుపచ్చగా మారుతుంది. మీ సౌలభ్యం కోసం యాప్‌లో స్పీకర్ ఆప్షన్ కూడా అందించారు. బ్లూటూత్ పరిధి 100 మీటర్లు కాబట్టి, ఈ యాప్ 100 మీటర్ల రేంజ్ లో కూడా పని చేస్తుంది.

click me!