ఆన్‌లైన్ మెసేజింగ్ దిగ్గజం వాట్సప్ తన వినియోగదారులకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందిస్తూనే ఉంది. ముఖ్యంగా ఈ ఏడాదిలో వెన్వెంటనే పలు ఫీచర్లు జోడిస్తోంది.
న్యూయార్క్: ఆన్‌లైన్ మెసేజింగ్ దిగ్గజం వాట్సప్ తన వినియోగదారులకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందిస్తూనే ఉంది. ముఖ్యంగా ఈ ఏడాదిలో వెన్వెంటనే పలు ఫీచర్లు జోడిస్తోంది.
ఇన్‌స్టాగ్రామ్ వీడియోల కోసం పిక్చర్ ఇన్ పిక్చర్ ఫీచర్, స్వైప్ టూ రిప్లై తదితర ఫీచర్లు వీటిలో ముఖ్యమైనవి. ఈ క్రమంలోనే వాట్సప్ తన వినియోగదారుల కోసం మరో వినూత్న ఫీచర్‌ను అందుబాటులోకి తేనున్నది. దీనిపేరు ‘వెకేషన్ మోడ్’. సెలవుల్లో సరదాగా గడిపేందుకు కొద్ది నెలలుగా ఈ ఫీచర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు వాట్సప్ సంస్థ తెలిపింది. ఈ మోడ్ ప్రస్తుతం ఉన్న సైలెంట్ మోడ్‌కు అడ్వాన్స్‌డ్ అని తెలిపింది.
ఒకవైపు వదంతులు, బూటకపు వార్తల వ్యాప్తిని అడ్డుకుంటూనే మరోవైపు అధునాతన పద్ధతులతో కూడిన ఫీచర్ల తయారీపై వాట్సప్ ద్రుష్టిని కేంద్రీకరించింది. ప్రస్తుతం సైలెంట్ మోడ్ ద్వారా చాట్ అలర్ట్‌ను హైడ్ చేసుకునే విధానం ఉంది. అంటే మ్యూట్ చేసిన కాంటాక్ట్ నుంచి సందేశం వస్తే అది నోటిఫికేషన్‌గా కనిపించదు.
undefined
ఆ కాంటాక్ట్ నుంచి ఎన్ని సందేశాలు వచ్చాయో కనీసం ఐకాన్‌పై కూడా కనబడదు. కొత్తగా వచ్చే వెకేషన్ మోడ్‌లో ఎంపిక చేసిన కాంటాక్ట్ నుంచి కొత్తగా వచ్చిన సందేశం ఆర్కైవ్ అవుతుంది. యూజర్లు ఈ విధానాన్ని నోటిఫికేషన్ సెట్టింగ్ ద్వారా నియంత్రించడానికి వీలుంది.
ఇదేకాక వాట్సప్ లింక్‌డ్ అకౌంట్స్ ఫీచర్‌పైనా కసరత్తు చేస్తోంది. దీని ద్వారా ఇతర సోషల్ మీడియా ఖాతాలతోనూ వాట్సప్ అకౌంట్స్‌ను అనుసంధానించుకోవచ్చు. ప్రాథమికంగా ఇన్‌స్టాగ్రామ్‌తో అనుసంధానించుకునే వెసులుబాటు రానున్నది. కానీ ఈ ఫీచర్ యూజర్లకు ఎంత మేర ఉపయోగపడుతుందనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ‘ఈ ఫీచర్ ద్వారా భవిష్యత్‌లో వాట్సప్‌ను ఉపయోగించి ఫేస్‌బుక్ ఖాతాను రికవర్ చేసుకునే అవకాశం ఉంటుంది.’’ అని వాట్సప్ బీటా ఇన్‌ఫో గత నెలలోనే ట్వీట్ చేసింది.
అంతే కాదు వాట్సప్ బిజినెస్ యూజర్ల కోసం స్టాండర్డ్ వాట్సప్ వర్షన్ అందుబాటులోకి తెచ్చేందుకు సంస్థ యాజమాన్యం చర్యలు తీసుకుంటున్నది. లింక్డ్ అక్కౌంట్స్ ఆప్షన్ అందుబాటులకి వస్తే ఇన్‌స్టాగ్రామ్‌కు ప్రారంభ దశలో వాట్సప్ మద్దతుగా నిలుస్తుంది. అయితే లింక్డ్ అక్కౌంట్స్ ఆప్షన్ నుంచి ఇన్‌స్టాగ్రామ్ వివరాలు చేరిస్తే వాట్సప్ అక్కౌంట్‌లోనే ఇన్‌స్టాగ్రామ్ కూడా చెక్ చేసుకోవచ్చు.