వొడాఫోన్ పోస్ట్ పెయిడ్ బిల్లుపై ఇలా 50% రాయితీ!!

By sivanagaprasad kodati  |  First Published Oct 17, 2018, 8:59 AM IST

దేశంలోనే అతిపెద్ద టెలికం సర్వీస్ ప్రొవైడర్ వొడాఫోన్ ఐడియా వినియోగదారులకు వివిధ రూపాల్లో క్యాష్ బ్యాక్ ఆపర్లు అందుబాటులోకి తెచ్చింది. సిటీ బ్యాంకు ద్వారా బిల్లులు చెల్లించే పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు 50 శాతం క్యాష్ బ్యాక్ రాయితీ కల్పిస్తోంది. పేటీఎం ద్వారా రీచార్జి చేసుకునే ప్రీ పెయిడ్ వినియోగదారులకు రెండు రకాల క్యాష్ బ్యాక్ ఆఫర్లు అందుబాటులోకి తెచ్చింది.


ఇటు కేంద్రం.. అటు కార్పొరేట్ సంస్థలు ప్రజలను నగదు రహిత చెల్లింపుల దిశగా ఆకర్షించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టాయి. అందులో భాగంగా వొడాఫోన్ ఐడియా కస్టమర్లు తమ పోస్ట్ పెయిడ్ బిల్లులు చెల్లించేందుకు సరికొత్త ఆఫర్ అందుబాటులోకి తెచ్చింది.

ఇందుకోసం సిటీ బ్యాంక్ యాజమాన్యంతో వొడాఫోన్ ఐడియా ఒప్పందం కుదుర్చుకుంది. నెలవారీ పోస్ట్ పెయిడ్ బిల్లులను సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా చెల్లిస్తే 50 శాతం డిస్కౌంట్ ఇస్తామని ప్రకటించింది. 

Latest Videos

undefined

ఏటా రూ.2,400 క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇలా
ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకునేందుకు వొడాఫోన్ ఐడియా కస్టమర్లు తక్షణం నూతన సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడమే ఆలస్యం. ఇందుకోసం రూ.4000 ఖర్చు చేస్తే 60 రోజుల్లో వారి చేతిలో సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటుంది.

వొడాఫోన్ అండ్ ఐడియా కస్టమర్లు ఇక వొడాఫోన్ రెడ్ లేదా ఐడియా నివారణ ప్లాన్ ప్రకారం రూ.399 అంత కంటే ఎక్కువ రీ చార్జి బిల్లులపై సగం వెనక్కు వస్తుంది. పోస్ట్ పెయిడ్ కస్టమర్ల నెలవారీ రెంటల్స్ చెల్లింపుపై రూ.2,400 క్యాష్ బ్యాక్ వస్తుంది. దీని ప్రకారం నెలకు రూ.200 చొప్పున రెంట్‌పై రాయితీ కల్పించినట్లన్న మాట.

సిటీబ్యాంక్ క్రెడిట్ కార్డు కోసం ఇలా దరఖాస్తు
కనుక వొడాఫోన్ అండ్ ఐడియా పోస్ట్ పెయిడ్ కస్టమర్లు వెంటనే న్యూ సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం మై వొడాఫోన్ యాప్ / మై ఐడియా యాప్, వొడాఫోన్ అండ్ ఐడియా వెబ్‌సైట్ లేదా, సిటీ బ్యాంక్ వెబ్‌సైట్ ను సంప్రదించాల్సి ఉంటుంది.

పేటీఎం ద్వారా రీ చార్జీ చేసుకుంటే రూ.25 క్యాష్ బ్యాక్
వొడాఫోన్ ఐడియా లిమిటెడ్.. డిజిటల్ పేమెంట్స్ దిగ్గజం పేటీఎంతో చేతులు కలిపింది. ఈ భాగస్వామ్యంతో పేటీఎం ద్వారా రీచార్జ్ చేసుకునే వినియోగదారులకు ఆకర్షణీయమైన వోచర్లు, అద్భుతమైన క్యాష్ బ్యాక్ ఆఫర్లు లభించనున్నాయి.

పేటీఎం ద్వారా తొలిసారి రూ.149 కనీస రీచార్జ్ చేసుకున్న కస్టమర్లకు రూ.25 క్యాష్ బ్యాక్‌ను ప్రకటించిన వొడాఫోన్ ఐడియా.. ఇప్పటికే పేటీఎంపై రీచార్జ్‌లు చేసుకుంటున్న వినియోగదారులకూ రూ.20 అదనపు క్యాష్ బ్యాక్‌ను ఇస్తామన్నది. పేటీఎం మాల్‌లో షాపింగ్, పేటీఎం ద్వారా సినిమా టిక్కెట్లను కొన్నవారికి రూ.375 విలువ కలిగిన వోచర్లు అందుతాయని తెలిపింది.

click me!