వాట్సాప్ కొత్త సెక్యూరిటీ ఫీచర్‌.. మీకు ఎవరిదైన స్టేటస్ నచ్చకపోతే ఇలా చేయవచ్చు..

By asianet news teluguFirst Published Dec 26, 2022, 11:31 AM IST
Highlights

ఈ ఫీచర్ ఫేస్‌బుక్ ఇంకా ఇన్‌స్టాగ్రామ్ వంటి కంటెంట్‌ను మోడరేట్ చేయడానికి తీసుకువస్తున్నారు. అంటే, ఎవరైనా యూజర్ సోషల్ మీడియా నిబంధనలను ఉల్లంఘిస్తే లేదా అసభ్యకరమైన స్టేటస్ పోస్ట్ చేసినట్లయితే వారి అక్కౌంట్  ఇంకా స్టేటస్ ను రిపోర్ట్ చేయవచ్చు. 

ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్లకు కొత్త, కొత్త ఫీచర్లను అందించడానికి నిరంతరం అనేక మార్పులు చేస్తూనే ఉంది. తాజాగా వాట్సాప్ మరో కొత్త సెక్యూరిటీ ఫీచర్‌ను విడుదల చేయనుంది. ఈ ఫీచర్ సహాయంతో యూజర్లు స్టేటస్ అప్ డేట్ లను రిపోర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ ఫేస్‌బుక్ ఇంకా ఇన్‌స్టాగ్రామ్ వంటి కంటెంట్‌ను మోడరేట్ చేయడానికి తీసుకువస్తున్నారు. అంటే, ఎవరైనా యూజర్ సోషల్ మీడియా నిబంధనలను ఉల్లంఘిస్తే లేదా అసభ్యకరమైన స్టేటస్ పోస్ట్ చేసినట్లయితే వారి అక్కౌంట్  ఇంకా స్టేటస్ ను రిపోర్ట్ చేయవచ్చు. వాట్సాప్ ఇటీవల డిలీట్ ఫర్ మి ఆప్షన్ కోసం అన్‌డూ బటన్‌ను విడుదల చేసింది.

వాట్సాప్ నుండి వస్తున్న ఈ ఫీచర్ గురించి సమాచారాన్ని WABetainfo వెబ్‌సైట్ అందించింది. WABetainfo నివేదిక ప్రకారం, వెబ్‌సైట్ కొత్త ఫీచర్ యూజర్ల స్టేటస్ విభాగంలోని మెనులో స్టేటస్ అప్ డేట్స్ రిపోర్ట్ చేయడానికి అనుమతిస్తుంది.

అంటే, మెసేజింగ్ యాప్ నిబంధనలను ఉల్లంఘించే ఏదైనా అనుమానాస్పద స్టేటస్ అప్‌డేట్‌ను యూజర్లు చూసినట్లయితే, ఏదైనా ఇన్‌ఫ్లమేటరీ లేదా అసభ్యకరమైన కంటెంట్‌ను పోస్ట్ చేస్తే  దానిని WhatsApp మోడరేషన్ టీంకి రిపోర్ట్ చేయవచ్చు. స్టేటస్ అప్‌డేట్‌లను రిపోర్ట్ చేసే ఫీచర్ ప్రస్తుతం పరీక్షించబడుతుందని నివేదికలో పేర్కొంది. త్వరలో దీన్ని వాట్సాప్ డెస్క్‌టాప్ కోసం విడుదల చేయవచ్చు. 

డిలీట్ ఫర్ మి ఆప్షన్‌ 
ఈ ఫీచర్ సహాయంతో అనుకోకుండా డిలెట్ చేసిన మెసేజెస్ కూడా తిరిగి తీసుకురావచ్చు. నిజానికి, డిలీట్ ఫర్ మి ఆప్షన్ అప్‌డేట్ సమయంలో ఈ ఫీచర్ తీసుకురాబడింది. అంటే, ఇప్పుడు యూజర్లు డిలీట్ ఫర్ మి ఆప్షన్‌ను పొరపాటున ట్యాప్ చేసిన తర్వాత కూడా డిలెట్ చేసిన మెసేజెస్ తిరిగి తీసుకురాగలుగుతారు.  

 డిలెట్ ఫర్ మీ అని నొక్కిన మీ గ్రూప్ చాట్ నుండి మెసేజ్ డిలెట్ అవుతుంది కానీ గ్రూప్ లో ఇతర సభ్యులు మెసేజెస్ చూడవచ్చు. కొన్నిసార్లు ఇబ్బందిని కూడా కలిగిస్తుంది. వాట్సాప్ కొత్త ఫీచర్ సహాయంతో, మీరు డిలీట్ ఫర్ మి ఆప్షన్‌పై నొక్కిన తర్వాత కూడా మెసేజ్ అన్‌డూ చేయగలుగుతారు. ఈ ఫీచర్ iOS ఇంకా Android రెండింటికీ అందుబాటులోకి వచ్చింది.
 

click me!