ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్‌ పోతాయేమోనన్న భయం ఇక అవసరం లేదు.. ఇది ఒక్కటి ఉంటె చాలు..?

By asianet news telugu  |  First Published Jun 6, 2023, 5:11 PM IST

ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్‌లు ఇంకా  ఇతర  ముఖ్యమైన డాకుమెంట్స్  డిజిటల్ ఫార్మాట్‌లో స్టార్ చేయబడతాయి 
 


ముఖ్యమైన డాకుమెంట్స్ పోతాయేమోనన్న భయం ఇక ఆవసరం లేదు. ఎందుకంటే వీటిని డిజి లాకర్‌కి లింక్ చేయవచ్చు. డిజి లాకర్ అంటే ఏమిటి ? డిజి లాకర్ అనేది ఆన్‌లైన్ డాక్యుమెంట్ స్టోరేజ్ అండ్  షేరింగ్ ప్లాట్‌ఫారమ్, దీని ద్వారా ఆధార్ కార్డ్‌లు, పాన్ కార్డ్‌లు, డ్రైవింగ్ లైసెన్స్‌లు ఇంకా ఇతర సర్టిఫికెట్‌ల వంటి ముఖ్యమైన డాకుమెంట్స్ డిజిటల్ ఫార్మాట్‌లో స్టోర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంకా  డాకుమెంట్స్ ఆన్‌లైన్‌లో యాక్సెస్ చేయడానికి అలాగే నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది. 

డిజిలాకర్‌తో ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇంకా ఇతర ముఖ్యమైన డాకుమెంట్స్ లింక్ చేయడం చాలా సులభం. డిజిలాకర్‌తో మీ ముఖ్యమైన డాకుమెంట్స్  ఎలా లింక్ చేయాలో తెలుసుకోండి.. 

Latest Videos

undefined

స్టెప్ 1: డిజిలాకర్ అకౌంట్ ఎలా క్రియేట్ చెయ్యాలంటే..?
డిజిలాకర్‌లో అకౌంట్ క్రియేట్ చేయడం మొదటి స్టెప్. మీరు డిజిలాకర్ వెబ్‌సైట్‌లో అకౌంట్  సృష్టించవచ్చు. లేదా మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో డిజిలాకర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అకౌంట్  సృష్టించడానికి మీరు మొబైల్ నంబర్‌ను ఇంటార్  చేసి, OTPని ఉపయోగించి వెరిఫై చెయ్యాలి.

స్టెప్ 2 :  డిజిలాకర్ అకౌంట్ కి లాగిన్ చెయ్యాలి 
అకౌంట్ సృష్టించిన తర్వాత, మీ యూజర్ ఐడి అండ్ పాస్‌వర్డ్‌తో మీ డిజిలాకర్ అకౌంట్ కి లాగిన్ చేయండి. లాగిన్ అయిన తర్వాత, మీరు డిజిలాకర్ అకౌంట్ హోమ్‌పేజీకి తీసుకెళ్లబడతారు.

స్టెప్ 3: ఆధార్ కార్డ్‌ని లింక్ చేయండి

డిజిలాకర్‌తో మీ ఆధార్ కార్డ్‌ని లింక్ చేయడానికి, మీ డిజిలాకర్ అకౌంట్ హోమ్‌పేజీలో ఉన్న "లింక్ యువర్ ఆధార్" బటన్‌పై క్లిక్ చేయండి. మీ ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయండి. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపి OTPని ఉపయోగించి  వెరిఫై చేయండి.

స్టెప్ 4: పాన్ కార్డ్‌ని లింక్ చేయండి

మీ పాన్ కార్డ్‌ని డిజిలాకర్‌తో లింక్ చేయడానికి, మీ డిజిలాకర్ అకౌంట్ హోమ్‌పేజీలో ఉన్న "లింక్ యువర్ పాన్" బటన్‌పై క్లిక్ చేయండి. మీ పాన్ నంబర్ అండ్ పుట్టిన తేదీని ఎంటర్  చేయమని మిమ్మల్ని అడుగుతారు. వివరాలను ఎంటర్  చేసిన తర్వాత, మీ పాన్ కార్డ్‌ని లింక్ చేయడానికి "సేవ్" పై క్లిక్ చేయండి.

స్టెప్ 5: ఇతర ముఖ్యమైన డాకుమెంట్స్ లింక్ చేయండి

డ్రైవింగ్ లైసెన్స్‌లు, సర్టిఫికెట్‌లు ఇంకా ఇతర డాక్యుమెంట్‌ల వంటి  ముఖ్యమైన డాక్యుమెంట్‌లు లింక్ చేయడానికి, మీ డిజిలాకర్ అకౌంట్ హోమ్‌పేజీలో ఉన్న "అప్‌లోడ్" బటన్‌పై క్లిక్ చేయండి. మీరు PDF, JPG లేదా PNG ఫార్మాట్ లో  డాకుమెంట్స్ అప్‌లోడ్ చేయవచ్చు. మీరు డాక్యుమెంట్‌లు అప్‌లోడ్ చేసిన తర్వాత, అవి మీ డిజిలాకర్ అకౌంట్ లో సేవ్ చేయబడతాయి.

click me!