బడ్జెట్ ధరలోనే వివో జడ్‌1ఎక్స్‌

By telugu team  |  First Published Sep 7, 2019, 12:16 PM IST

చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో తన జడ్ సిరీస్‌లో మరో ఫోన్‌ను ఆవిష్కరించింది. జడ్ 1ఎక్స్ మోడల్ ఫోన్ విపణిలో బడ్జెట్ ధరకే అందుబాటులోకి రానుంది. 6జీబీ ర్యామ్ విత్ 65 జీబీ స్టోరేజీ మోడల్ ఫోన్ ధర రూ.16,990 అయితే, 6జీబీ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ఫోన్ ధర రూ.18,990 మాత్రమే. ఈ ఫోన్లలో ఫీచర్లు కూడా అద్భుతంగా ఉన్నాయి.
 


చైనా మొబైల్‌ తయారీ సంస్థ ‘వివో’ తన జడ్‌ సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ ఆవిష్కరించింది.  ‘వివో జడ్ 1 ఎక్స్’  పేరుతో భారతదేశ విపణిలో ప్రవేశపెట్టింది. వివో జడ్-సిరీస్‌లో ఇది కంపెనీ రెండవ ఫోన్. 

ఈ ఫోన్‌లో 48 మెగా పిక్సెల్ ట్రిపుల్ కెమెరా, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, అమోలేడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 712 సాక్‌, 22 వాట్‌ ఫ్లాష్‌చార్జ్‌ స్పెషల్‌ ఫీచర్లు ఉన్నాయి. ఫాంటమ్ పర్పుల్, ఫ్యూజన్ బ్లూ రంగులలో లాంచ్‌ అయిన ఈ స్మార్ట్‌ఫోన్‌, ఫ్లిప్‌కార్ట్, వివో ఆన్‌లైన్ స్టోర్ ద్వారా కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంటుంది. 

Latest Videos

వివో ‘జడ్ 1 ఎక్స్’ ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. 6 జీబీర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ .16,990 కాగా, 6 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజ్ సామర్థ్యం గల ఫోన్ ధర  రూ.18,990గా నిర్ణయించారు.  

ఆఫర్ల విషయానికొస్తే, వివో జెడ్ 1 ఎక్స్ ఫోన్ కొనుగోలుపై రిలయన్స్ జియో రూ .6,000 విలువైన ప్రయోజనాలను అందిస్తోంది. అంతేకాకుండా, వినియోగదారులు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డు కొనుగోలు చేస్తే రూ.1,250 ఆఫర్‌ కూడా ఉంది. ఈ నెల 13వ తేదీ నుంచి వివో ‘జడ్ 1 ఎక్స్’ ఫోన్లు విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి.  

వివో జడ్ 1 ఎక్స్ ఫోన్‌లో 6.38-అంగుళాల సూపర్ అమోలెడ్‌ వాటర్‌డ్రాప్ నాచ్‌ డిస్‌ప్లే ఉంది. 
స్నాప్‌డ్రాగన్ 712 ఎఐఈ ప్రాసెసర్‌ ఏర్పాటు చేసిన ఈ ఫోన్.. ‘ఆండ్రాయిడ్‌ 9 పై’ పై పని చేస్తుంది. 
48+ 2+8 ఎంపీ రియర్‌ ట్రిపుల్‌ కెమెరాతోపాటు 32 ఎంపీ సెల్పీ కెమెరా ఈ ఫోన్ సొంతం. ఇక వివో జడ్ ఎక్స్ ఫోన్‌లో 4500 ఎంఏహెచ్‌ సామర్థ్యం గల బ్యాటరీ ఏర్పాటు చేశారు. 

click me!