ఇండియాలో 90Hz రిఫ్రెష్ రేట్‌తో Vivo కొత్త స్మార్ట్ ఫోన్.. తక్కువ ధరకే పవర్ ఫుల్ ఫీచర్‌లు

By asianet news teluguFirst Published Jul 20, 2022, 2:44 PM IST
Highlights

వివో టి1ఎక్స్ ని మార్కెట్లో గ్రావిటీ బ్లాక్ అండ్ స్పేస్ బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్‌లలో పరిచయం చేసింది. క్వాల్ కం స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్ వివో టి1ఎక్స్ లో ఇచ్చారు. ఈ ఫోన్ 5000mAh బ్యాటరీతో 90Hz డిస్‌ప్లే పొందుతుంది. 
 

చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో  కొత్త ఫోన్ వివో టి1ఎక్స్‌ను భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఇప్పటికే చైనా మార్కెట్‌లో 4G అండ్ 5G రెండు వేరియంట్‌లలో లాంచ్ అయ్యింది. Vivo T1x బడ్జెట్ సెగ్మెంట్ స్మార్ట్‌ఫోన్, దీనిని 4G కనెక్టివిటీతో ఇండియాలోకి తీసుకువచ్చింది. క్వాల్ కం స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్ Vivo T1xలో ఇచ్చారు. ఈ ఫోన్ 5000mAh బ్యాటరీతో 90Hz డిస్‌ప్లే పొందుతుంది. Vivo T1x ఫీచర్లు, ధర, స్పెసిఫికేషన్ గురించి చూద్దాం...

Vivo T1x ధర
 వివో టి1ఎక్స్‌ మార్కెట్లో గ్రావిటీ బ్లాక్, స్పేస్ బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్‌లలో పరిచయం చేసింది. ఈ ఫోన్ మూడు స్టోరేజ్ వేరియంట్లలో లాంచ్ చేసారు. 4 జీబీ ర్యామ్‌తో కూడిన ఫోన్ 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 11,999, 4 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 11,999, 6 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 11,999. Vivo T1xని జూలై 27 నుండి ఫ్లిప్‌కార్ట్ నుండి కొనుగోలు చేయవచ్చు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డ్‌తో ఫోన్ కొనుగోలు చేస్తే వెయ్యి రూపాయల తగ్గింపు కూడా లభిస్తుంది.

 స్పెసిఫికేషన్‌లు
 వివో టి1ఎక్స్‌ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.58-అంగుళాల పూర్తి HD+ LCD డిస్‌ప్లే, Qualcomm Snapdragon 680 ప్రాసెసర్, 4-లేయర్ కూలింగ్ సిస్టమ్ ఉంది. 

కెమెరా
డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఫోన్‌లో ఉంటుంది, దీని ప్రైమరీ కెమెరా 50-మెగాపిక్సెల్ సెన్సార్‌తో f/1.8 ఎపర్చరుతో వస్తుంది. రెండవ కెమెరా 2 మెగాపిక్సెల్స్ f/2.4 ఎపర్చరుతో వస్తుంది. సెల్ఫీ కోసం ఈ ఫోన్ 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. Vivo T1x కెమెరా సూపర్ HDR, మల్టీ-లేయర్ పోర్ట్రెయిట్, స్లో మోషన్ వంటి ఫీచర్లకు సపోర్ట్ చేస్తుంది.

బ్యాటరీ
మీరు Vivo T1xలో 5000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఫోన్ రివర్స్ ఛార్జింగ్‌ కూడా సపోర్ట్ చేస్తుంది. సెక్యూరిటి కోసం ఈ ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. Vivo T1xలో కనెక్టివిటీ కోసం యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉన్నాయి.  4G LTE, Wi-Fi, బ్లూటూత్ v5.0, GPS/ A-GPS, FM రేడియో, USB టైప్-C పోర్ట్‌  కూడా పొందుతుంది.
 

click me!