లైంగిక వేధింపులను నివారించడానికి ఫేస్ బుక్ సరికొత్త ఫీచర్‌.. దాని గురించి ఎంటో తెలుసుకోండి..

Ashok Kumar   | Asianet News
Published : Feb 08, 2022, 05:23 AM IST
లైంగిక వేధింపులను నివారించడానికి ఫేస్ బుక్ సరికొత్త ఫీచర్‌.. దాని గురించి ఎంటో తెలుసుకోండి..

సారాంశం

మెటావర్స్ లో పర్సనల్ బౌండరీ ఫీచర్‌ని ఒకసారి ఆన్ చేసిన తర్వాత మీ సరిహద్దును మరెవరూ దాటలేరు అని మెటా పేర్కొంది. మెటా ప్రకారం,  పర్సనల్ బౌండరీ  ఫీచర్ వినియోగదారులకు వర్చువల్ అవతార్‌లో  ఒకరికిఒకరు నాలుగు అడుగుల దూరంలో ఉన్నట్లుగా భావించేలా చేస్తుంది.

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ దాని పేరును మెటాగా మార్చుకున్న సంగతి మీకు తెలిసిందే.  అలాగే ప్రపంచం మెటావర్స్ అని పిలవాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. ఎన్నో ఇతర కంపెనీలు కూడా మెటావర్స్‌పై పనిచేస్తున్నాయి. తాజాగా ఒక వివాహం మొదటిసారి భారతదేశంలో మెటావర్స్‌లో జరిగింది. ఫేస్‌బుక్  మెటావర్స్( Metaverse) ప్రారంభించినప్పటి నుండి లైంగిక వేధింపులపై వివాదంలో ఉంది.

కొన్ని రోజుల క్రితం మెటావర్స్ లో ఒక మహిళ లైంగిక వేధింపుల గురించి ఫిర్యాదు చేసింది, ఆ తర్వాత కంపెనీ పర్సనల్ బౌండరీ అనే ఫీచర్‌ను పరిచయం చేసింది, ఈ ఫీచర్ వర్చువల్ రియాలిటీ ప్రపంచంలోని వ్యక్తులు ఒకరికొకరు కొంత దూరాన్ని కొనసాగించడంలో సహాయపడుతుందని కంపెనీ తెలిపింది. 

    మెటావర్స్ లో వ్యక్తిగత సరిహద్దు (personal boundary)ఫీచర్‌ని ఒకసారి ఆన్ చేసిన తర్వాత, మీ సరిహద్దును మరెవరూ దాటలేరు అని మెటా (Meta) పేర్కొంది. మెటా ప్రకారం వ్యక్తిగత సరిహద్దు ఫీచర్ వినియోగదారులకు వర్చువల్ అవతార్‌లు ఒకదానికొకటి నాలుగు అడుగుల దూరంలో ఉన్నట్లుగా భావించేలా చేస్తుంది. ఈ ఫీచర్ డిఫాల్ట్‌గా ఆన్‌లో ఉంటుందని, వినియోగదారుల మధ్య అవాంఛిత సాన్నిహిత్యాన్ని తొలగిస్తుందని మెటా తెలిపింది. అటువంటి పరిస్థితిలో ప్రజల గోప్యత గౌరవించబడుతుంది. ఈ ఫీచర్ అవతార్  వ్యక్తిగత పరిధిలోకి ఎవరూ ప్రవేశించకుండా నిరోధిస్తుంది.

మెటావర్స్ అంటే ఏమిటి
మెటావర్స్ అనేది రియాలిటీకి వర్చువల్ రూపం ఇవ్వబడే ఇంటర్నెట్ ఏవోల్యూషన్. ఈ వర్చువల్ ప్రపంచంలో  మీరు 3D రూపంలో ఇంటరాక్ట్ అయ్యేందుకు మీతో పాటు ఇతర వ్యక్తుల వర్చువల్ అవతార్‌లు లేదా ఇడియోసింక్రాసీలను కలిగి ఉంటాము. అయితే, మెటావర్స్  ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీ ప్రపంచంలో వర్చువల్‌గా పరస్పరం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి  మనం వి‌ఆర్ హెడ్‌సెట్‌ని కలిగి ఉండాలి. నేడు ప్రపంచంలోని పెద్ద పెద్ద టెక్ దిగ్గజం కంపెనీలు మెటావర్స్‌లో బిలియన్ల డాలర్లను పెట్టుబడి పెడుతున్నాయి.

PREV
click me!

Recommended Stories

YouTube : యూట్యూబర్లకు పండగే.. ఇక ఏఐ రీల్స్ వచ్చేస్తున్నాయి.. ఎలా చేయాలో తెలుసా..?
మీ ఫోన్ నెంబర్ తో పనిలేకుండా రీచార్జ్ చేసుకోవచ్చు... ఎలాగో తెలుసా..?