ఫేస్ అన్‌లాక్, లేటెస్ట్ కెమెరా ఫీచర్లతో కొత్త 5జి ఫోన్.. ధర కూడా 15వేల లోపే..

By asianet news telugu  |  First Published Dec 14, 2022, 4:34 PM IST

 ఒప్పో  ఏ58ఎక్స్ 5జిని బ్రీజ్ పర్పుల్, స్టార్రి స్కై బ్లాక్, ట్రాంక్విలిటీ బ్లూ కలర్ ఆప్షన్‌లలో పరిచయం చేసారు. ఫోన్ 8జి‌బి ర్యామ్ తో 128జి‌బి స్టోరేజ్  వేరియంట్ ధర 1,200 చైనీస్ యువాన్లు అంటే దాదాపు రూ. 14,500. 


స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఒప్పో  బడ్జెట్ ఫోన్ ఒప్పో  ఏ58ఎక్స్ 5జిని లాంచ్ చేసింది. మీడియా టెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్, 6.56-అంగుళాల హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే ఫోన్‌తో అందించారు. 8జి‌బి వరకు ర్యామ్ తో ఫోన్‌లో 128జి‌బి వరకు స్టోరేజ్ లభిస్తుంది. దీనికి 5,000 mAh బ్యాటరీ ఇచ్చారు.

ధర 
 ఒప్పో  ఏ58ఎక్స్ 5జిని బ్రీజ్ పర్పుల్, స్టార్రి స్కై బ్లాక్, ట్రాంక్విలిటీ బ్లూ కలర్ ఆప్షన్‌లలో పరిచయం చేసారు. ఫోన్ 8జి‌బి ర్యామ్ తో 128జి‌బి స్టోరేజ్  వేరియంట్ ధర 1,200 చైనీస్ యువాన్లు అంటే దాదాపు రూ. 14,500. ఈ ఫోన్‌ను భారతదేశంలో లాంచ్ గురించి కంపెనీ ఇంకా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. 

Latest Videos

undefined

 స్పెసిఫికేషన్లు
 ఒప్పో  ఏ58ఎక్స్ 5జికి 6.56-అంగుళాల HD ప్లస్ LCD డిస్‌ప్లే, (720 x 1612 పిక్సెల్‌లు) రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఫోన్‌తో, MediaTek డైమెన్సిటీ 700 ప్రాసెసర్, 8జి‌బి LPDDR4xతో 128 జి‌బి UFS 2.2 స్టోరేజ్ ఉంది. ఫోన్‌లో సెక్యూరిటి కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ సౌకర్యం ఇచ్చారు. 

  కెమెరా
 ఒప్పో  ఏ58ఎక్స్ 5జికి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది, దీనిలో 13-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్, 2-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీ అండ్ వీడియో కాల్స్ కోసం ఫోన్‌లో 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. నైట్ మోడ్, AI ID ఫోటో, టైమ్-లాప్స్, స్లో మోషన్, ఇతర ఫీచర్లు కెమెరాతో లభిస్తాయి.

 బ్యాటరీ 
ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీతో వస్తుంది, ఇంకా 10W ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.3, USB టైప్-C పోర్ట్, 3.5mm ఆడియో జాక్  ఉన్నాయి.

click me!