నోకియా త్వరలో భారతదేశంలో కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సిద్ధమైంది. దీని ధర నుండి ఇతర వివరాల వరకు ఇక్కడ చూడవచ్చు.
స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ నోకియా ఇండియాలో కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ Xలో అప్ కమింగ్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ తాజాగా వెల్లడించింది.
నోకియా సోషల్ మీడియా పోస్ట్‌లో, “మీరు నోకియా 5G స్మార్ట్‌ఫోన్‌తో స్పీడ్ ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నారా ? అయితే సెప్టెంబర్ 6, 2023 ప్రకటన కోసం వేచి ఉండండి” అంటూ కంపెనీ X పోస్ట్ చేసింది. రాబోయే స్మార్ట్‌ఫోన్ గురించి నోకియా ఇంకా ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. అయితే, బ్రాండ్ తాజాగా USలో నోకియా C210తో పాటు Nokia G310 5Gని విడుదల చేసింది.
ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన టీజర్ వీడియోలో ఫోన్ కర్వ్ మూలలను మాత్రమే చూపుతుంది. నివేదికల ప్రకారం, గత నెలలో USలో లాంచ్ చేసిన Nokia G310 5G, స్నాప్‌డ్రాగన్ 480+ చిప్‌సెట్ అండ్ 4జీబీ ర్యామ్ +128 GB మెమరీతో వస్తుంది. ముందు ప్యానెల్ 720p రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్ ఇంకా వాటర్‌డ్రాప్ నాచ్‌తో 6.56-అంగుళాల LCD ఉంది.
కెమెరా పరంగా, ఈ స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది, ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్ అండ్ మాక్రో లెన్స్ ఉన్నాయి. వీడియో కాల్స్ ఇంకా సెల్ఫీ కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. క్లియర్ సౌండ్ కోసం Nokia OZO ఆడియోతో వీడియో రికార్డ్ చేసినప్పుడు AIతో ఫోటోస్ తీసుకోవచ్చు.
Are you ready to experience speed with Nokia 5G smartphone? Stay tuned for the announcement on September 6, 2023. pic.twitter.com/XigoMvfxAW
— Nokia Mobile India (@NokiamobileIN)నోకియా G310 5G 5,000mAh బ్యాటరీతో 20W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. HMD గ్లోబల్ గత నెలలో భారతదేశంలో కొత్త ఫీచర్ ఫోన్‌లను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇవి నోకియా 130 మ్యూజిక్ అండ్ నోకియా 150. నోకియా 150 1,450 mAh రిమూవబుల్ బ్యాటరీతో వస్తుంది. అలాగే, నోకియా 130 మ్యూజిక్ 1450 mAh బ్యాటరీతో వస్తుంది.