Twitter Texas: ట్విట్టర్ టెక్సాస్‌కు మారనుందా.. ఆ రైతు ఇచ్చిన ఆఫర్ మామూలుగా లేదుగా..!

By team telugu  |  First Published May 3, 2022, 4:32 PM IST

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విట్ట‌ర్‌ను చేజిక్కించుకుని ఎంతటి సంచలనం సృష్టించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ నిర్ణయం ప్రకంపనలకు దారి తీసింది. అయితే.. ట్విట్ట‌ర్ ఎలాన్ మస్క్ పరమైన మరుసటి రోజే అమెరికాలోని ఓ రైతు సంచలన ఆఫర్ చేశాడు. తన వద్ద ఉన్న వంద ఎకరాలను మస్క్‌కు ఉచితంగా ఇచ్చేస్తానంటూ కలకలం రేపాడు
 


ట్విట్టర్ హెడ్ క్వార్టర్ టెక్సాస్‌లోని విలియమ్సన్ కౌంటిలో ఉన్న తన గ్రామానికి మారిస్తే వ0ద ఎకరాలు ఉచితంగా ఇస్తాని ఓ ఆసామి ఎలన్ మస్క్‌కు ఆఫర్ ఇచ్చారు. టెక్సాస్‌ రాష్ట్రం ఆస్టిన్‌లో పశువుల్ని పెంపకంతో పాటు కాపిటల్ ల్యాండ్ అండ్‌ లైవ్‌స్టాక్ కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉన్న జిమ్ ఈ ఆఫర్ చేశాడు. ఆయనకు 20వేల ఎకరాల భూమి ఉంది.  ట్విట్ట‌ర్‌ క్యాంపస్‌ను ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలమని రైతు చెబుతున్నారు.    

మరోవైపు రైతు  ఇచ్చిన ఆఫర్‌కు ఇంకా ఎలన్ మస్క్ స్పందించలేదు. ఎలన్‌ మస్క్‌కు నచ్చితే ట్విట్ట‌ర్‌ ఆఫీస్‌ను కాలిఫోర్నియా నుంచి టెక్సాస్‌కు ఇట్టే మార్చేస్తారని అంటున్నారు. ఆయన నిర్ణయాలు అలాగే ఉంటాయని గుర్తు చేస్తున్నారు. పైగా ఎలన్  మస్క్‌కు చెందిన మూడు కంపెనీలు టెక్సాస్‌ రాష్ట్రంలోనే ఉన్నాయి. టెస్లా ప్రధాన కార్యాలయం ఆస్టిన్‌లో ఉంది. స్పేస్‌ ఎక్స్‌ బోకా చికా, దిబోరింగ్‌ కంపెనీ ప్లుగర్విల్లే నగరంలో ఉంది. ఈ మూడు ప్రాంతాలు టెక్సాస్‌ రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి ట్విట్ట‌ర్‌ను కాలిఫోర్నియా నుంచి టెక్సాస్‌కు మారిస్తే కార్యకాలపాలకు ఈజీగా ఉంటుందని చెబుతున్నారు.

Latest Videos

undefined

ష‍్వెర్టనర్‌ ఆఫర్‌పై టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబోట్ స్పందించారు. టెక్సాస్‌లో నివాసం ఉండే ష్వెర్ట్‌నర్‌ ట్వట్ట‌ర్‌ను తరలించేందుకు మస్క్‌కు 100 ఎకరాల ల్యాండ్‌ను ఉచితంగా అందిస్తాను. నేను ఫ్రీ స్పీచ్‌ జోన్‌గా ప్రకటిస్తా. ట్విట్ట‌ర్‌ కార్యాలయం షిప్ట్‌ అయితే ట్విట్ట‌ర్‌ను టెక్సాస్‌గా మార్చుకోవచ్చు. దీని గురించి ఆలోచించు ఎలన్‌ మస్క్‌ అంటే మస్క్‌ ట్విట్ట‌ర్‌కు ట్యాగ్‌ చేశారు. వీళ్ల ఆఫర్లపై ఎలన్ మస్క్ స్పందించాల్సి ఉంది. ట్విట్టర్ ను మస్క్ కొనుగోలు చేసినప్పటి నుండి.. ట్విట్టర్ మొత్తం ఎలన్ మస్క్ విశేషాలే కనిపిస్తున్నాయి.  అయితే ఈ విష‌యంపై నెటిజ‌న్లు విచిత్రంగా స్పందిస్తున్నారు. అద్భుత‌మైన ఐడియా అని కొంద‌రు యూజ‌ర్లు రిప్లై ఇవ్వ‌గా.. మ‌రి కొంద‌రేమో డూ ఈట్ ఎలాన్ మ‌స్క్ అని రిప్లై ఇచ్చారు. మ‌రీ.. ప్ర‌పంచ కుబేరుడు అయినా ఎలాన్ మ‌స్క్ ఎలా స్పందిస్తారో చూడాలి. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ వైర‌ల్‌గా మారింది.

ఒక వేళ ఈ ప్రపోజల్‌ ఎలన్‌ మస్క్‌కు నచ్చితే ట్విట్ట‌ర్‌ ఆఫీస్‌ను కాలిఫోర్నియా నుంచి టెక్సాస్‌కు మారడం ఖాయం అవుతుంది. మస్క్‌ కూడా ట్విట్టర్‌ ఆఫీసును టెక్సాస్‌ రాష్ట్రంలో కొనసాగించాలని భావిస్తున్నారట. మస్క్‌కు చెందిన మూడు కంపెనీలు టెక్సాస్‌ రాష్ట్రంలోనే ఉండడంతో ట్విట్టర్ కార్యాలయాన్ని కూడా టెక్సాస్‌కు మార్చేందుకు ప్రయత్నిస్తున్నారట. తన వ్యాపారాలు అన్నీ ఒకే చోట ఉంటే ప్రయాణం తగ్గుతుందని ఆయన భావిస్తున్నారట. సమయం డబ్బు రెండు ఆదా అవుతాయని మస్క్ భావిస్తున్నారట. అయితే ఈపాటికే చాలా మంది ఉద్యోగులు కాలిఫోర్నియాలో సెటిల్ అవ్వడంతో వీళ్లల్లో ఎంత మంది టెక్సాస్‌కు షిఫ్ట్ అవుతారని మస్క్‌ లెక్కలు వేసుకుంటున్నారట. ఒక వేళ ఉద్యోగులు రాకపోతే టెక్సాస్‌లో అంతటి నిపుణులైన ఉద్యోగులు దొరుకుతారా లేదా అనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారట.

click me!