Tagg Verve Connect: భార‌త మార్కెట్‌లోకి న్యూ స్మార్ట్‌వాచ్‌.. 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే చాలు..!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Apr 01, 2022, 04:18 PM IST
Tagg Verve Connect:  భార‌త మార్కెట్‌లోకి న్యూ స్మార్ట్‌వాచ్‌.. 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే చాలు..!

సారాంశం

న్యూ  స్మార్ట్‌వాచ్‌  Tagg Verve Connect ఏప్రిల్ 2న సరికొత్త స్మార్ట్‌వాచ్‌ను భార‌త్ మార్కెట్‌లో విడుద‌ల చేయ‌నుంది. మార్కెట్లో దీని ధర రూ.రూ. 2799గా నిర్ణయించారు. ఈ స్మార్ట్‌వాచ్ ఫ్లిప్ కార్ట్‌లో అందుబాటులో ఉండ‌నుంది.  

న్యూ  స్మార్ట్‌వాచ్‌  Tagg Verve Connect  ఏప్రిల్ 2న  ఇండియా మార్కెట్‌లో విడుదల కానుంది. ఈ వాచ్‌లో బ్లడ్ ఆక్సిజన్ మానిటర్ (SpO2), హార్ట్ రేట్ మానిటర్‌తో పాటు స్లీప్ ట్రాకింగ్, హెల్త్ ఫీచర్లు ఉంటాయి. ఈ వాచ్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉండనుంది. బడ్జెట్ ధరలోనే ఈ వాచ్ లభిస్తోంది. ఈ బడ్జెట్ ట్యాగ్ వెర్వ్ కనెక్ట్ స్మార్ట్‌వాచ్  ఫీచర్స్, ధరల గురించి మరింతగా తెలుసుకుందాం.

Tagg Verve Connect ధర

స్మార్ట్‌వాచ్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 2799కు అందుబాటులో ఉంటుంది. ఏప్రిల్ 2 మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ప్రారంభం అవుతుంది. అదే రోజున కంపెనీ వాచ్‌ను విడుదల చేయనుంది. ఫ్లిప్‌కార్ట్‌లో యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేసిన కస్టమర్‌లు ఈ వాచ్‌పై 5% అపరిమిత క్యాష్‌బ్యాక్ పొందుతారు.

Tagg Verve Connect ఫీచర్స్

ఈ స్మార్ట్ వాచ్ 1.7-అంగుళాల IPS LCD టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 500 నిట్‌ల గరిష్ట లైటింగ్ సపోర్ట్ ఇస్తుంది. వాటర్ ఫ్రూతో కలిగిన ఈ వాచ్ IP67 రేటింగ్ పొందుతుంది. మ్యూజిక్, కెమెరా నియంత్రణ, టైమర్, అలారం, SMS అలర్ట్స్, స్మార్ట్ అసిస్టెంట్ ఫీచర్‌లతో వస్తుంది. ఇంటర్నల్ డయల్ ప్యాడ్‌తో బ్లూటూత్ కాలింగ్‌తో స్మార్ట్‌వాచ్‌ని ఉపయోగించి డైరెక్ట్ కాలింగ్ చేయవచ్చు. 

అంతేకాకుండా.. గరిష్టంగా 100 కాంటక్ట్స్‌ను కూడా సేవ్ చేయవచ్చు. Tagg Verve Connect బ్లడ్-ఆక్సిజన్ మానిటర్ (SpO2), హార్ట్ రేట్ మానిటర్‌తో పాటు స్లీప్ ట్రాకింగ్ వంటి హెల్త్ చెకప్‌లను చేసుకోవచ్చు. ఇది రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, ఇతర క్రీడలతో సహా 24 స్పోర్ట్స్ మోడ్‌లతో వస్తుంది. ఇందులో క్లౌడ్ ఆధారిత 150+ స్పోర్ట్స్ మోడ్‌లు కూడా అందించబడుతుంది. ఈ స్మార్ట్‌వాచ్‌ని ఫుల్‌ ఛార్జ్‌తో 5 రోజుల పాటు ఉపయోగించవచ్చు. కాబట్టి కేవలం 10 నిమిషాల ఛార్జింగ్ 10 గంటల బ్యాటరీ లైఫ్ ఇస్తోంది.

PREV
click me!

Recommended Stories

Starlink : ఎలన్ మస్క్ స్టార్‌లింక్ భారత్‌లో స్టార్ట్ : ప్లాన్‌లు, స్పీడ్, సైన్‌అప్.. ఫుల్ డిటెయిల్స్ ఇవే
మీ ఫోన్ లో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా..? అయితే వాట్సాప్ హ్యాక్ అయినట్లే, ఈ టైమ్ లో ఏం చేయాలి?