Samsung Galaxy M33 5G: ఏప్రిల్ 2న శాంసంగ్ గెలాక్సీ M33 5G విడుద‌ల‌.. కేవ‌లం అమెజాన్‌లోనే..!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Mar 27, 2022, 01:39 PM ISTUpdated : Mar 28, 2022, 07:35 PM IST
Samsung Galaxy M33 5G: ఏప్రిల్ 2న శాంసంగ్ గెలాక్సీ M33 5G విడుద‌ల‌.. కేవ‌లం అమెజాన్‌లోనే..!

సారాంశం

కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని చూస్తున్నారా, 5జీ టెక్నాలజీ అయితే మరింత బాగుంటుందని ఆలోచిస్తున్నారా..! అయితే ఇంకెందుకు ఆలస్యం మీ కోసం వచ్చేస్తోంది.. Samsung Galaxy M33 5G స్మార్ట్ ఫోన్. ఇప్పటికే ఈ ఫోన్ కు సంబంధించిన టీజర్ విడుదలయ్యింది. పూర్తి పీచర్లు, ధర వివరాలు, లాంఛ్ వివ‌రాలు తెలుసుకోండి.   

ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ M33 5G స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది. ఏప్రిల్ 2న మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ కొత్త గెలాక్సీ M33 5G స్మార్ట్ ఫోన్ ఈ-కామర్స్ దిగ్గజమైన అమెజాన్ ప్లాట్ ఫాంపై సేల్ లో అందుబాటులో ఉండనుంది. మిడ్ రేంజ్ ఆఫర్ అందిస్తున్న ఈ గెలాక్సీ M33 మోడల్ హ్యాండ్‌సెట్ 5nm ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో వస్తోంది. 25W ఛార్జింగ్‌కు సపోర్టుతో 6,000mAh బ్యాటరీని అందిస్తోంది. Samsung Galaxy M33 5G 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. శాంసంగ్ నుంచి రాబోయే ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ అందిస్తోంది. Galaxy M33 5G భారత మార్కెట్లో ఎంత ఉంటుంది అనేది వివరాలు రివీల్ చేయలేదు. కానీ, అమెజాన్ వెబ్ సైట్లో ఈ ఫోన్ విక్రయానికి సంబంధించి డేట్ మాత్రమే ధ్రువీకరించింది. ఆసక్తిగల కొనుగోలుదారులు స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చినప్పుడు నోటిఫై చేసేందుకు అమెజాన్‌లో ‘Notify Me’ అనే బటన్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది.

Samsung Galaxy M33 5G స్పెసిఫికేషన్స్

Amazon వెబ్‌సైట్ ప్రకారం.. Samsung Galaxy M33 5G ఫోన్ కిందిభాగంలో 5nm ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను అందిస్తోంది. స్మార్ట్‌ఫోన్ రెండు RAM, స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో వచ్చింది. 6GB + 128GB, 8GB + 128GB వేరియంట్లలో రానుంది. Samsung Galaxy M33 5G 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు 6,000mAh బ్యాటరీతో రానుందని అమెజాన్ లిస్టులో కనిపిస్తోంది. Samsung Galaxy M33 5G ఫోన్ కు సంబంధించి స్పెసిఫికేషన్‌లు ఈ నెల ప్రారంభంలోనే టిప్‌స్టర్ ద్వారా లీక్ అయ్యాయి. Samsung Galaxy A13, Samsung Galaxy A23, Samsung Galaxy M23 5Gలతో పాటు ప్రపంచ మార్కెట్‌లలో Samsung Galaxy M33 5G కూడా అదే ఫీచర్లు ఉన్నాయి.. 

Samsung Galaxy M33 5G భారతీయ మోడల్ ఆండ్రాయిడ్ 12-ఆధారిత One UI 4.1పై రన్ అవుతుందట.. ఇక ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల పూర్తి-HD+(1,080×2,408 పిక్సెల్‌లు) LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. అమెజాన్ జాబితాలో చూసినట్లుగా.. గెలాక్సీ M33 5G క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌తో రానుంది. స్మార్ట్‌ఫోన్‌లో 50-MP ప్రైమరీ సెన్సార్, 5-MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, రెండు 2-MP మాక్రో, డెప్త్ కెమెరాలు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 8-MP కెమెరాను కూడా కలిగి ఉన్నాయని భావిస్తున్నారు. టిప్‌స్టర్ ప్రకారం.. హ్యాండ్‌సెట్‌లో 3.5 మిమీ హెడ్‌ఫోన్ జాక్‌తో పాటు సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుందని అంచనా.

PREV
click me!

Recommended Stories

Technology : స్మార్ట్‌ఫోన్‌లు ఇక పాత కథ.. 2026లో రాబోయే ఈ 9 వస్తువులను చూస్తే షాక్ అవుతారు..!
Smart phone: మీ స్మార్ట్‌ఫోన్ ఎందుకు వేడెక్కుతుందో ఎప్పుడైనా ఆలోచించారా.? అస‌లు కార‌ణం ఇదే