డ్రోన్ సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫారమ్ స్కైడెక్‌ని ప్రారంభించిన జియో అనుబంధ సంస్థ ఆస్టెరియా ఏరోస్పేస్..

By asianet news telugu  |  First Published Mar 26, 2022, 6:15 PM IST

స్కైడెక్‌(SkyDeck) అనేది వ్యవసాయం, పారిశ్రామిక ఇన్స్పెక్షన్స్, సర్వేలియన్స్ అండ్ సెక్యూరిటి వంటి వివిధ పరిశ్రమల కోసం డ్రోన్-యాజ్-ఎ-సర్వీస్ (DaaS) సోల్యూషన్స్ అందించడానికి క్లౌడ్-ఆధారిత సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫారమ్. 
 


భారతదేశంలో డ్రోన్ తయారీదారి, సొల్యూషన్ ప్రొవైడర్ జియో ప్లాట్‌ఫారమ్‌ అనుబంధ సంస్థ ఆస్టెరియా ఏరోస్పేస్ ఎండ్-టు-ఎండ్  డ్రోన్ ఆపరేషన్స్ ప్లాట్‌ఫారమ్ 'స్కైడెక్‌'(SkyDeck)ను లాంచ్ చేసింది. స్కైడెక్‌(SkyDeck) అనేది వ్యవసాయం, పారిశ్రామిక ఇన్స్పెక్షన్స్, సర్వేలియన్స్ అండ్ సెక్యూరిటి వంటి వివిధ పరిశ్రమల కోసం డ్రోన్-యాజ్-ఎ-సర్వీస్ (DaaS) సోల్యూషన్స్ అందించడానికి క్లౌడ్-ఆధారిత సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫారమ్. 

స్కైడెక్‌ డ్రోన్ ఫ్లీట్ మేనేజ్‌మెంట్, డ్రోన్ ఫ్లయిట్స్ షెడ్యూల్ చేయడం, అమలు చేయడం, డేటా ప్రాసెసింగ్ అండ్ విజువలైజేషన్, డ్రోన్‌లను ఉపయోగించి క్యాప్చర్ చేయబడిన ఏరియల్ డేటా  AI-ఆధారిత అనాలిసిస్ వంటి సేవలను అందిస్తుంది.  SkyDeck ఫీచర్లను వివరిస్తూ ఆపరేషనల్  ట్రాన్స్పరెన్సీ నిర్ధారిస్తుంది, స్టేక్ హోల్డర్స్ మధ్య సహకారాన్ని మెరుగుపరుస్తుంది ఇంకా మల్టీ అప్లికేషన్‌లలో డ్రోన్ ప్రోగ్రామ్‌లను స్కేలింగ్ చేయడానికి సురక్షితమైన అండ్ సెంట్రలైజేడ్ మ్యానేజ్మెంట్ అందిస్తుంది. 

Latest Videos

undefined

ఆస్టెరియా ఏరోస్పేస్ సహ వ్యవస్థాపకుడు & డైరెక్టర్ నీల్ మెహతా  మాట్లాడుతూ“డ్రోన్ కార్యకలాపాలకు సంబంధించిన నిబంధనలను ఇటీవల సరళీకరించడం అలాగే ప్రభుత్వం DaaSని ప్రోత్సహించడం వల్ల పరిశ్రమ రంగాలలో డ్రోన్‌ల డిమాండ్ పెరిగింది. ఆస్టెరియా ఇప్పటికే భారతదేశంలోని ప్రముఖ డ్రోన్ తయారీదారులలో ఒకటి. SkyDeck ప్రారంభంతో మేము ఇంటిగ్రేటెడ్ డ్రోన్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ అండ్ ఆపరేషన్స్ సొల్యూషన్‌తో సమయం అవసరాన్ని పరిష్కరిస్తున్నాము. SkyDeck ఏరియల్ డేటాను రూపొందించడానికి డ్రోన్‌ల వినియోగాన్ని సులభతరం చేస్తుంది ఇంకా  డిజిటల్ డేటాను డ్రోన్ అప్లికేషన్‌ల స్కేల్‌లో పవర్ చేయడానికి బిజినెస్ ఇన్ సైట్స్ గా మారుస్తుంది అని అన్నారు.

వ్యవసాయ రంగం కోసం SkyDeck పంట నాణ్యతను ఖచ్చితంగా కొలవడానికి, పంట ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి ఇంకా వ్యవసాయ ఇన్‌పుట్‌లను ఆప్టిమైజ్ చేయడానికి ఉపయోగించే డేటా అండ్ ఇన్ సైట్ అందిస్తుంది. నిర్మాణం, మైనింగ్ పరిశ్రమల కోసం, SkyDeck ప్రోగ్రెస్ పర్యవేక్షించడానికి, ఖచ్చితమైన ఇంవెంటరీ రికార్డులను నిర్వహించడానికి  అక్యురేట్ సైట్ సర్వేలను రూపొందించడానికి డ్రోన్-ఆధారిత ఎరియల్ డేటాను ఉపయోగిస్తుంది. ఆయిల్ & గ్యాస్, టెలికాం, పవర్ & యుటిలిటీస్ వంటి కీలకమైన మౌలిక సదుపాయాల రంగాల కోసం నివారణ నిర్వహణ, బెదిరింపులను గుర్తించడం, మార్పులను రికార్డ్ చేయడం కోసం అసెట్స్ డిజిటలైజ్, చెక్ చేయడానికి స్కైడెక్ డ్రోన్‌ల శక్తిని ఉపయోగిస్తుంది. స్వామిత్వ స్కీమ్, స్మార్ట్ సిటీలు, అగ్రిస్టాక్ అండ్ ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల వంటి వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రారంభలలో డ్రోన్‌ ఫ్లిట్స్ విజయవంతంగా అమలు చేయడంలో SkyDeck సహాయపడుతుంది.


ఆస్టెరియా ఏరోస్పేస్ గురించి

Asteria Aerospace Ltd (www.asteria.co.in) అనేది ఫుల్-స్టాక్ డ్రోన్ టెక్నాలజీ కంపెనీ,  ఏరియల్ డేటా నుండి చర్యలు తీసుకోదగిన మేధస్సును అందిస్తుంది. ఆస్టెరియా  ఇంటర్నల్ హార్డ్‌వేర్ డిజైన్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ అండ్ తయారీ సామర్థ్యాలను ఉపయోగించి ప్రభుత్వం ఇంకా ఎంటర్‌ప్రైజ్ కస్టమర్ల కోసం  కస్టమైజేడ్ డ్రోన్ సోల్యూషన్స్ అభివృద్ధి చేస్తుంది. డిఫెన్స్ & హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ, వ్యవసాయం, చమురు & గ్యాస్, ఎనర్జీ & యుటిలిటీస్, టెలికమ్యూనికేషన్స్, మైనింగ్, నిర్మాణ రంగాలకు, నాణ్యత-కేంద్రీకృత ఇంకా విశ్వసనీయ ఉత్పత్తులు & సేవలను అందించడానికి ఆస్టెరియా విశ్వసనీయ భాగస్వామి.

ఆస్టెరియా ఏరోస్పేస్ లిమిటెడ్ అనేది జియో ప్లాట్‌ఫారమ్‌ల అనుబంధ సంస్థ, ఇంకా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మెజారిటీ యాజమాన్యంలోని అనుబంధ సంస్థ.

click me!