సామ్ సంగ్ మడతపెట్టే స్మార్ట్ ఫోన్ వచ్చేసింది

By ramya NFirst Published Feb 21, 2019, 12:53 PM IST
Highlights

స్మార్ట్ ఫోన్ ప్రియులకు సామ్ సంగ్ శుభవార్త  చెప్పింది. ఎంతోకాలంగా చాలా మంది ఎదురుచూస్తున్న ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ని సామ్ సంగ్ విడుదల చేసింది. 

స్మార్ట్ ఫోన్ ప్రియులకు సామ్ సంగ్ శుభవార్త  చెప్పింది. ఎంతోకాలంగా చాలా మంది ఎదురుచూస్తున్న ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ని సామ్ సంగ్ విడుదల చేసింది. శాన్ ఫ్రాన్సిస్కోలో జరుగుతున్న ఓ కార్యక్రమంలో సామ్ సంగ్ ఈ ఫోన్ ని విడుదల చేసింది.

గెలాక్సీ ఫోల్డ్ గా తీసుకొచ్చిన ఈ ఫోన్ మడతపెట్టినప్పుడు 4.6 అంగుళాల డిస్ ప్లే ఉంటుంది. ఫోన్ తెరిస్తే.. 7.3 అంగుళాల ట్యాబ్ లాగా కూడా వాడుకోవచ్చు. అమెరికాలోని ఏప్రిల్ 26నుంచి గెలాక్సీ ఫోల్డ్ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. దీని ప్రారంభ ధర 1,980 డాలర్లుగా ఉండనుంది. భారత కరెన్సీలో రూ.1.40లక్షల పైమాటే.

ఈ ఫోన్ లో 12జీబీ ర్యామ్, 512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 4,380ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉంటుంది. ఈ ఫోన్లో మొత్తం ఆరు కెమేరాలు ఉన్నాయి. వెనక వైపు 16మెగా పిక్సెల్ తో ఒక కెమేరా, 12మెగా పిక్సెల్ తో రెండు కెమేరాలు ఉంటాయి. ముందు వైపు మూడు కెమేరాలు ఉండగా.. ఫోన్ మడత పెట్టినప్పుడు రెండు లోపలికి వెళతాయి. 10మెగాపిక్సెల్ తో సెల్ఫీ కెమేరా ఉంది.

click me!