Samsung Projector:ఇండియాలో స్యామ్సంగ్ ఫ్రీస్టైల్ ప్రొజెక్టర్ లాంచ్.. ఇంటర్నల్ స్పీకర్‌, అంబియంట్ లైట్ కూడా..

By asianet news telugu  |  First Published Mar 30, 2022, 5:11 PM IST

స్యామ్సంగ్  ఫ్రీస్టైల్ 100-అంగుళాల (2 బై 54 సెం.మీ) వరకు స్క్రీన్ సైజ్ వీడియోను ప్రొజెక్ట్ చేయగలదు. అల్ట్రా-పోర్టబుల్ ప్రొజెక్టర్ ఫ్రీస్టైల్ స్యామ్సంగ్ అధికారిక ఆన్‌లైన్ స్టోర్ స్యామ్సంగ్ షాప్, అమెజాన్ లో రూ.84,990కి అందుబాటులో ఉంటుంది.
 


 స్యామ్సంగ్  సి‌ఈ‌ఎస్ (Samsung CES 2022)లో స్యామ్సంగ్ ఫ్రీస్టైల్ ప్రొజెక్టర్‌ని పరిచయం చేసింది. ఇప్పుడు ఈ ప్రొజెక్టర్ భారతీయ మార్కెట్లో లాంచ్ చేయబడింది. ఈ  ప్రొజెక్టర్ నుండి స్మార్ట్ స్పీకర్, యాంబియంట్ లైటింగ్ డివైజ్ వరకు పని చేస్తుంది. Samsung ఫ్రీస్టైల్ బరువు 830 గ్రాములు. దీని సహాయంతో, మీరు ఏ స్థలాన్ని అయినా సినిమా స్క్రీన్‌గా మార్చగలరు. ఈ శాంసంగ్ ప్రొజెక్టర్ 180 డిగ్రీల వరకు తిరిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

ఫ్రీస్టైల్ 100-అంగుళాల (2 బై 54 సెం.మీ) వరకు స్క్రీన్ పరిమాణాలపై వీడియోను ప్రొజెక్ట్ చేయగలదు. అల్ట్రా-పోర్టబుల్ ప్రొజెక్టర్ అయిన ఫ్రీస్టైల్ Samsung అధికారిక ఆన్‌లైన్ స్టోర్ Samsung షాప్, Amazonలో రూ.84,990కి అందుబాటులో ఉంటుంది. అలాగే కస్టమర్లు రూ. 5,000 వరకు క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు. నేడు సాయంత్రం 6 గంటల నుండి 31 మార్చి 2022 రాత్రి 11.59 గంటల వరకు ఫ్రీస్టైల్‌ను కొనుగోలు చేసే వినియోగదారులు రూ. 5,900 విలువైన ఫ్రీస్టైల్ క్యారీ కేస్‌ను ఉచితంగా పొందుతారు.

Latest Videos

undefined

ఈ ప్రొజెక్టర్‌లోని ఉత్తమమైన అంశం ఏమిటంటే, ఫ్రీస్టైల్ మీ గోడ  రంగును బట్టి ప్రొజెక్షన్‌ని చేస్తుంది కాబట్టి దీని కోసం మీకు ఎలాంటి తెల్లని స్క్రీన్ అవసరం లేదు. సర్టిఫైడ్ OTT ప్లాట్‌ఫారమ్‌తో కూడిన ఇండస్ట్రి మొట్టమొదటి పోర్టబుల్ ప్రొజెక్టర్ ది ఫ్రీస్టైల్ అని Samsung పేర్కొంది. ఇంకా మొబైల్ మిర్రరింగ్, కాస్టింగ్ ఫీచర్లతో కూడా వస్తుంది.

Galaxy వినియోగదారుల కోసం, ఫ్రీస్టైల్ Galaxy డివైజెస్ తో సింక్ బటన్‌ ఉంది. ఈ బటన్‌ను నొక్కడం ద్వారా వినియోగదారులు గెలాక్సీ డివైజ్ ని ఇన్స్టంట్ రిమోట్ కంట్రోల్‌గా ఉపయోగించవచ్చు. Wi-Fi నెట్‌వర్క్ అందుబాటులో లేనప్పుడు మొబైల్ హాట్‌స్పాట్‌ను కూడా ఉపయోగించవచ్చు.

ఫ్రీస్టైల్ వినియోగదారులకు సినిమా లాంటి ఆడియోను అందించడానికి ఓమ్ని-డైరెక్షనల్ 360-డిగ్రీ సౌండ్‌తో శక్తివంతమైన ఇంటర్నల్ స్పీకర్‌తో వస్తుంది. ఫ్రీస్టైల్ ఇండస్ట్రి  మొట్టమొదటి ఫార్-ఫీల్డ్ వాయిస్ కంట్రోల్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. కాబట్టి స్క్రీన్ ఆన్ చేసినప్పుడు, వినియోగదారులు వారి వాయిస్‌ని ఉపయోగించి కంటెంట్ కోసం సెర్చ్ చేయవచ్చు.

click me!