రిలయన్స్ జియో కొత్త 4G ప్లాన్‌లు.. యూజర్ల డిమాండ్ తీర్చడానికి లాంచ్.. పూర్తి వివరాలు ఇవే !!

By asianet news telugu  |  First Published Jul 12, 2023, 11:17 AM IST

ఈ రెండు డేటా బూస్టర్ ప్లాన్‌లు రూ. 19 ఇంకా  రూ. 29,  జియో ప్రస్తుత ప్లాన్‌లకు అదనం. ఇవి యాక్టివ్ రీఛార్జ్ ప్యాక్‌కి ఎక్కువ డేటాను అందిస్తాయి. జియో రూ.19 ఇంకా రూ.29తో రెండు కొత్త డేటా బూస్టర్ ప్లాన్‌లను వినియోగదారులకు వరుసగా 1.5GB ఇంకా  2.5GB హై-స్పీడ్ 4G డేటాను అందిస్తాయి.


దేశీయ టెలికం రిలయన్స్ జియో తాజాగా   డైలీ డేటా లిమిట్  ముగిసిన తర్వాత ఫాస్టెస్ట్ ఇంటర్నెట్ డేటాను కోరుకునే వినియోగదారుల కోసం కొత్త ప్రీపెయిడ్ డేటా ప్లాన్‌లను ప్రవేశపెట్టింది.

రిలయన్స్ జియో  యూజర్ల వివిధ డిమాండ్లను తీర్చడానికి ఎప్పటికప్పుడు కొత్త కొత్త మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెడుతూనే ఉంది. డైలీ  హై-స్పీడ్ ఇంటర్నెట్ ప్యాక్‌ని ఉపయోగించిన తర్వాత  ఇంటర్నెట్‌ని టాప్ అప్ చేయాల్సిన కస్టమర్‌ల కోసం ఈ రెండు కొత్త ప్రీపెయిడ్ డేటా రీఛార్జ్ ప్లాన్‌లను జియో పరిచయం చేస్తోంది.

Latest Videos

undefined

ఈ రెండు డేటా బూస్టర్ ప్లాన్‌లు రూ. 19 ఇంకా  రూ. 29,  జియో ప్రస్తుత ప్లాన్‌లకు అదనం. ఇవి యాక్టివ్ రీఛార్జ్ ప్యాక్‌కి ఎక్కువ డేటాను అందిస్తాయి. జియో రూ.19 ఇంకా రూ.29తో రెండు కొత్త డేటా బూస్టర్ ప్లాన్‌లను వినియోగదారులకు వరుసగా 1.5GB ఇంకా  2.5GB హై-స్పీడ్ 4G డేటాను అందిస్తాయి. పైన పేర్కొన్న డేటా లిమిట్ ముగిసిన  తర్వాత 64 Kbps స్పీడ్ తో ఆన్ లిమిటెడ్ డేటాను ఉపయోగించవచ్చు.

కస్టమర్‌లు జియో 5జీ నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయినట్లయితే, రెండు డేటా బూస్టర్‌లు 5జీ ఇంటర్నెట్ స్పీడ్‌ను అందిస్తాయి. జియో కస్టమర్లు  డేటా బూస్టర్ ప్యాక్‌లను My Jio యాప్ లేదా ఇతర సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు. మీరు మరిన్ని అప్షన్స్ కోసం చూస్తున్నట్లయితే వినియోగదారులు ఎంచుకోవడానికి జియో 7 డేటా బూస్టర్ ప్లాన్‌లను కూడా  అందిస్తుంది.

రూ. 15 నుంచి రూ. 222 వరకు వినియోగదారులు అవసరాలకు అనుగుణంగా ఈ ప్లాన్‌లను కొనుగోలు చేయవచ్చు. రిలయన్స్ జియో 4G ఫోన్ JioBharat ను విడుదల చేసిన సంగతి మీకు తెలిసిందే. రూ. 999 ధర కలిగిన ఈ ఫోన్ 2G ఫోన్‌ల వాడే వారు 4G నెట్‌వర్క్‌కి మారేందుకు సహాయపడుతుంది. JioBharat Phoneతో వినియోగదారుల కోసం ప్రత్యేకమైన ప్రీపెయిడ్ ప్లాన్ అప్షన్స్ ప్రవేశపెట్టింది. వీటి ధర రూ. 123 నుండి  ప్రారంభమవుతుంది. JioBharat ప్లాన్‌లు స్టాండర్డ్  ఇంటర్నెట్ ప్లాన్‌ల కంటే తక్కువ ఖర్చుతో కూడుకున్నవి.

click me!