రిలయన్స్ జియో స్వాతంత్ర దినోత్సవ ఆఫర్‌ను ప్రకటిస్తూ రూ. 2,999 అన్యువల్ రీఛార్జ్ ప్యాక్‌ను ప్రారంభించింది, ఇది ఎన్నో అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఈ ఆఫర్ Jio యాప్ అండ్ వెబ్‌సైట్ రెండింటిలోనూ కనిపిస్తుంది.
టెలికం దిగ్గజం రిలయన్స్ జియో ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం కొత్త స్వాతంత్ర దినోత్సవ ఆఫర్‌ను ప్రారంభిస్తూ ఇప్పుడు రూ. 2,999 వార్షిక రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది, దింతో వివిధ రకాల అదనపు బెనిఫిట్స్ అందిస్తుంది. కాల్స్, ఇంటర్నెట్‌తో పాటుగా, Jio ప్యాకేజీలో ప్రముఖ ఫుడ్ డెలివరీ సర్వీసెస్, ట్రావెల్, ఆన్‌లైన్ షాపింగ్ ఇంకా మరిన్ని వాటిపై సేవింగ్స్ వంటి అనేక అదనపు లాభాలు లభిస్తాయి.
అదనపు ప్రయోజనాలలోకి వెళ్లే ముందు అన్యువల్ రూ. 2,999 ప్లాన్ ప్రైమరీ ఫీచర్స్ చూస్తే వినియోగదారులు ఏడాది పొడవునా ప్రతిరోజూ 100 SMSలు, రోజుకు 2.5GB ఇంటర్నెట్, ఆన్ లిమిటెడ్ ఫోన్ కాల్స్ అందుకుంటారు. బండిల్ వినియోగదారులు 5G డేటాను కూడా స్వీకరించవచ్చు.
undefined
జియో ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం, ఈ జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్ 2023 అదనపు బెనిఫిట్లను కూడా అందిస్తుంది. యాత్ర ద్వారా బుక్ చేసుకున్న విమానాల్లో రూ. 1,500 వరకు సేవింగ్, అలాగే రూ. 249 లేదా అంతకంటే ఎక్కువ ధర కలిగిన స్విగ్గీ కొనుగోళ్లపై రూ. 100 తగ్గింపు కూడా ఇందులో ఉన్నాయి.
అదనంగా, యాత్ర ద్వారా దేశీయ హోటళ్లను బుక్ చేసుకునే కస్టమర్లు 15 శాతం తగ్గింపు (రూ. 4,000 వరకు) పొందవచ్చు. Ajioలో సెలెక్ట్ చేసిన వస్తువులు రూ. 999 లేదా అంతకంటే ఎక్కువ ఆర్డర్‌లపై రూ. 200 తగ్గింపుకు కూడా అర్హులు. నెట్‌మెడ్స్‌లో, రూ. 999 కంటే ఎక్కువ ఆర్డర్‌లకు 20% తగ్గింపు ఇంకా అదనపు NMS సూపర్‌క్యాష్ కూడా ఉన్నాయి. అదనంగా, సెలెక్ట్ చేసిన ఆడియో డివైజెస్ అండ్ రిలయన్స్ డిజిటల్ ద్వారా కొనుగోలు చేసిన గృహోపకరణాలు డీల్ కింద ఫ్లాట్ 10 శాతం తగ్గింపుకు అర్హులు.
ఈ లేటెస్ట్ ఆఫర్ ఇప్పటికే ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం అందుబాటులో ఉంది, కాబట్టి కస్టమర్లు దానిని క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే ఈ డీల్ ముగిసే ఖచ్చితమైన తేదీ ఇంకా తెలియరాలేదు. Jio అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ప్రజలు డీల్‌ని ఉపయోగించి రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు.