రియల్ మీ స్లిమ్ ఫోన్.. ఫోటోగ్రఫి కోసం స్పెషల్ మోడ్ ఇంకా ఎన్నో బెస్ట్ ఫీచర్స్ కూడా..

By asianet news telugu  |  First Published Jan 9, 2023, 4:56 PM IST

రియల్ మీ 10 రెండు కలర్స్ లో క్లాష్ వైట్, రష్ బ్లాక్‌లో పరిచయం చేసారు. రియల్ మీ 10 ధర 4జి‌బి ర్యామ్  64జి‌బి  స్టోరేజ్‌ ధర  రూ. 13,999, 8జి‌బి ర్యామ్ తో 128జి‌బి స్టోరేజీ ధర  రూ.16,999. 


చైనీస్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ రియల్ మీ కొత్త ఫోన్ రియల్ మీ 10ని ఇండియాలో లాంచ్ చేసింది. రియల్ మీ 10 అనేది 4G ఫోన్, దీనిలో మీడియా టెక్ హెలియో G99 ప్రాసెసర్ ఇచ్చారు. ఈ ఫోన్లో  50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్,  ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీ ఉంది. సెల్ఫీ కోసం ఫోన్‌లో 16 మెగాపిక్సెల్ కెమెరా అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ బడ్జెట్ ఫోన్‌తో కూడా మీకు ఆమోలెడ్ డిస్ ప్లే లభిస్తుంది.

రియల్ మీ 10 ధర
రియల్ మీ 10 రెండు కలర్స్ లో క్లాష్ వైట్, రష్ బ్లాక్‌లో పరిచయం చేసారు. రియల్ మీ 10 ధర 4జి‌బి ర్యామ్  64జి‌బి  స్టోరేజ్‌ ధర  రూ. 13,999, 8జి‌బి ర్యామ్ తో 128జి‌బి స్టోరేజీ ధర  రూ.16,999. ఫ్లిప్‌కార్ట్‌తో సహా అన్ని స్టోర్‌లలో జనవరి 15 నుండి ఫోన్ అందుబాటులో ఉంటుంది. ICICI బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌తో పేమెంట్ పై రూ. 1,000 డిస్కౌంట్ ఉంటుంది, డిస్కౌంట్ తర్వాత  4జి‌బి వేరియంట్ ధర రూ. 12,999, 8జి‌బి వేరియంట్ ధర రూ. 15,999.

Latest Videos

స్పెసిఫికేషన్లు
రియల్ మీ 10తో మీడియా టెక్ హీలీయో G99 ప్రాసెసర్‌తో 8జి‌బి వరకు ర్యామ్, 128జి‌బి వరకు స్టోరేజ్ అందించారు. 33W SUPERVOOC ఛార్జింగ్ ఫోన్‌తో ఉంటుంది, దీని బ్యాటరీ కేవలం 28 నిమిషాల్లో 50 శాతం వరకు ఛార్జ్ చేయబడుతుందని పేర్కొంది.

కెమెరా గురించి మాట్లాడితే  ఇందులో రెండు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి, ప్రైమరీ లెన్స్ 50 మెగాపిక్సెల్స్ ఇంకా రెండవ లెన్స్ 2 మెగాపిక్సెల్స్, ముందు భాగంలో సెల్ఫీ కోసం 16-మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. వెనుకవైపు ఉన్న 2 మెగాపిక్సెల్ లెన్స్ ప్రొఫెషనల్ పోర్ట్రెయిట్ మోడ్ కోసం. నైట్ ఫోటోగ్రఫీ మోడ్ అండ్ స్ట్రీట్ మోడ్ కూడా కెమెరాతో అందించారు.

రియల్ మీ 10 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.4-అంగుళాల ఆమోలెడ్ డిస్‌ప్లే ఉంది. డిస్ ప్లే పై గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంది. ఈ ఫోన్ 7.95 ఎం‌ఎం సన్నగా ఉంటుంది, దీనికి సంబంధించి ఈ విభాగంలో ఈ ఫోన్ చాలా సన్నని ఫోన్ అని కంపెనీ తెలిపింది. ఫోన్‌తో పాటు 4జి‌బి డైనమిక్ ర్యామ్ కూడా ఉంది. ఇతర ఫీచర్ల గురించి చెప్పాలంటే, ఇందులో హై-రెస్ డ్యూయల్ ఆడియో ఉంటుంది. ఫోన్ మొత్తం బరువు 178 గ్రాములు.

click me!