పబ్-జి కొత్త గేమ్.. లాంచ్ కి ముందే కోటికి పైగా రిజిస్ట్రేషన్లు.. త్వరలో అందుబాటులోకి

By S Ashok KumarFirst Published Apr 13, 2021, 1:03 PM IST
Highlights

పబ్-జి  కొత్త గేమ్ లాంచ్ కి సిద్దమైంది. ఈ గేమ్ లో ముఖ్యంగా 2051లో వచ్చే రైళ్లు, ఆయుధాలు, కొత్త మ్యాప్స్ మొదలైన వాటిని చూడవచ్చు.

 పబ్-జి గేమ్ డెవలపర్స్  నుండి వస్తున్న కొత్త గేమ్ పబ్-జి : న్యూ స్టేట్ లాంచ్ కి ముందు సంచలనం సృష్టించింది. తాజాగా  గూగుల్ ప్లే-స్టోర్‌లో ఈ గేమ్ కోసం  కోటి మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ సమాచారాన్ని కంపెనీ  ట్వీట్  ద్వారా వెల్లడించింది.

ఈ గేమ్ పబ్-జి మొబైల్‌ను భర్తీ చేస్తుందని చెబుతున్నారు.  పబ్-జి : న్యూ స్టేట్ గేమ్ రిజిస్ట్రేషన్   ఫిబ్రవరిలో గూగుల్ ప్లే-స్టోర్‌లో  అందుబాటులోకి వచ్చింది. అయితే గూగుల్ ప్లే-స్టోర్‌లో భారతీయ వినియోగదారులకు ఈ గేమ్ అందుబాటులో లేదు.

 ఫిబ్రవరి నుండి రిజిస్ట్రేషన్లు 
 పబ్-జి : న్యూ స్టేట్ కోసం గూగుల్ ప్లే స్టోర్‌లో ప్రీ-రిజిస్ట్రేషన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమైంది.  పబ్-జి  స్టూడియో ఈ న్యూ స్టేట్ గేమ్ ని తయారు చేసింది.  ఈ గేమ్ సంబంధించి యూట్యూబ్‌లో ట్రైలర్ కూడా విడుదల చేసింది. అంతే కాకుండా  పబ్-జి : న్యూ స్టేట్ పేరుతో కొత్త వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ఖాతాలు కూడా క్రియేట్ చేశారు.

also read మీ ఫోన్‌లో ఈ 8 యాప్స్ ఉంటే వెంటనే డిలెట్ చేయండి.. లేదంటే మీ బ్యాంక్ అక్కౌంట్ హ్యాక్ కావొచ్చు.. ...

 ఈ గేమ్ ట్రైలర్‌లో కొన్ని గేమ్ ప్లే, గ్రాఫిక్స్, కొత్త మెకానిక్‌లను చూడవచ్చు. ఈ గేమ్ లో 2051లో వచ్చే రైళ్లు, ఆయుధాలు, కొత్త మ్యాప్స్ మొదలైన వాటిని చూడవచ్చు. ఈ గేమ్ దక్షిణ కొరియా వీడియో గేమింగ్ సంస్థ క్రాఫ్టన్ పబ్లిష్ చేసింది.

భారతదేశంలో  పబ్-జి : న్యూ స్టేట్ ప్రారంభించబడుతుందా ?
పబ్-జి కార్పొరేషన్  మాతృ సంస్థ క్రాఫ్టన్  న్యూ స్టేట్ గేమ్ ని తీసుకొస్తుంది. భారతదేశంలో ఈ గేమ్  ప్రారంభించబడదని కంపెనీ తెలిపింది. భారతదేశంలో  పబ్-జి : న్యూ స్టేట్ ను ప్రారంభించటానికి ప్రస్తుతం ఎలాంటి  ప్రణాళికలు  లేవని క్రాఫ్టోన్ ఒక ప్రకటనలో తెలిపింది. 

క్రాఫ్టన్ కంపెనీ మాట్లాడుతూ, 'భారతీయ మార్కెట్లో మేము  పబ్-జి : న్యూ స్టేట్  కోసం రిజిస్ట్రేషన్ తీసుకోలేదనేది నిజం. భారతదేశంలోని గూగుల్ ప్లే స్టోర్‌లో గేమ్ యాప్ కనిపించినప్పటికీ, వినియోగదారులు  రిజిస్ట్రేషన్ చేయలేరు. భారతీయ మార్కెట్ కోసం మేము ప్రస్తుతం పియుబిజి మొబైల్ ఇండియాపై దృష్టి సారించామని కంపెనీ తెలిపింది.

 

We’re happy to report that we’ve hit over 10 MILLION pre-registrations on . We’re humbled by the community’s overwhelming response and can’t wait to share our new battlegrounds experience with you later in 2021. pic.twitter.com/WN3ptw3ylq

— PUBG: NEW STATE (@PUBG_NEWSTATE)
click me!