గూగుల్‌ క్లౌడ్‌ కొత్త సీఈఓగా ఇండో అమెరికన్ కురియన్‌

By sivanagaprasad kodati  |  First Published Nov 18, 2018, 12:00 PM IST

గూగుల్ క్లౌడ్ తదుపరి సీఈఓగా భారత సంతతికి చెందిన థామస్ కురియన్ నియమితులయ్యారు. వచ్చే ఏడాది జనవరిలో బాధ్యతలు చేపడతారు. అప్పటివరకు సీఈఓగా ఉన్న డయాన్ గ్రీన్ ఇక ముందు గూగుల్ ఆల్పాబెట్ డైరెక్టర్‌గా కొనసాగుతారు. 


గూగుల్‌ క్లౌడ్‌ తదుపరి ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ)గా భారత సంతతికి చెందిన అమెరికన్ థామస్‌ కురియన్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. కేరళ రాష్ట్రం కొట్టాయం జిల్లా పాంపడే గ్రామం ఆయన స్వస్థలం.

ఒరాకిల్‌లో ఉత్పత్తుల విభాగానికి సారథిగా పనిచేసిన ఆయన ఈ నెల 26న గూగుల్‌ క్లౌడ్‌లో చేరుతారు. అయితే సీఈఓగా బాధ్యతలు వచ్చే ఏడాది జనవరిలో చేపడుతారు. అప్పటివరకు ప్రస్తుత సీఈఓ డియాన్‌ గ్రీన్‌ పదవిలో కొనసాగుతారు. తర్వాత కూడా ఆల్ఫాబెట్‌ బోర్టు డైరెక్టర్‌గా కూడా ఆమె ఉంటారు. 

Latest Videos

undefined

ఒరాకిల్ సంస్థ ఉత్పత్తుల విభాగం అధ్యక్షుడిగా 22 ఏళ్ల అనుభవంతో థామస్ కురియన్.. గూగుల్ క్లౌడ్ బిజినెస్ ను కూడా తదుపరి స్థాయికి తీసుకెళ్లేందుకు అద్భుతమైన క్రుషి చేస్తారని తాను నమ్ముతున్నట్లు తెలిపారు. డయాన్ గ్రీన్ 2015 డిసెంబర్ నెలలో గూగుల్‌లో చేరారు. తర్వాత క్లౌడ్ బిజినెస్ బాధ్యతలు చేపట్టారు. 

మూడేళ్లపాటు నమ్మశక్యం గానీ రీతిలో గూగుల్ క్లౌడ్ ఉత్పత్తులకు ఉద్దీపన కలిగించేందుకు చర్యలు తీసుకున్నానని, ప్రస్తుతం మార్పులకు సరైన సమయం అని డయాన్ గ్రీన్ తెలిపారు. తదుపరి ఎడ్యుకేషన్, మెంటరింగ్ విధుల నిర్వహణపై ద్రుష్టి పెట్టాల్సి ఉందన్నారు. ఇంజినీరింగ్ విద్య పూర్తి చేసిన మహిళా సీఈఓగా పెట్టుబడితోపాటు సంస్థకు మెంటరింగ్ బాధ్యతలు నిర్వర్తించడం సహాయకారిగా ఉంటుందన్నారు.

తాను ఎల్లవేళలా ప్రతి మహిళా ఇంజినీర్‌ను, మహిళా శాస్త్రవేత్తను ప్రోత్సహిస్తానని డయాన్ గ్రీన్ తెలిపారు. దీనివల్ల మున్ముందు ప్రపంచంలో వివిధ కంపెనీలకు కొంత మంది వ్యవస్థాపక మహిళా సీఈఓలుగా నియమితులయ్యే అవకాశం ఉన్నదన్నారు.

కేవలం ఇద్దరు గణనీయ కస్టమర్లతో మొదలైన గూగుల్ క్లౌడ్ ప్రయాణాన్ని స్టార్టప్‌ల కలెక్షన్‌గానూ, ఫార్చ్యూన్ 1000 సంస్థల్లో ఒకటిగా తీర్చి దిద్దారు. క్లౌడ్ విభాగానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని డయాన్ గ్రీన్ తెలిపారు. గత ఫిబ్రవరిలో గూగుల్ క్లౌడ్ బిజినెస్‌లో బిలియన్ డాలర్లకు పైగా త్రైమాసిక ఆదాయం సంపాదించినట్లు గూగుల్ ప్రకటించింది. 

click me!