చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ ఒప్పో తన తొలి 5జీ స్మార్ట్ ఫోన్‌ను స్వదేశీ మార్కెట్లోకి విడుదల చేసింది. రెనో 2కి కొనసాగింపుగా.. రెనో 3ప్రో, రెనో 3 పేర్లతో ఒకే సారి రెండు 5జీ మోడళ్లను విడుదల చేసింది ఆ సంస్థ. ఈ ఫోన్ భారత్ విపణిలోకి మార్చికల్లా వస్తుందని అంచనా వేస్తున్నారు.
బీజింగ్: చైనా స్మార్ట్ఫోన్ల తయారీ దిగ్గజం ‘ఒప్పో’ 5జీ టెక్నాలజీలో ప్రత్యర్థి సంస్థలకు గట్టిపోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. మార్కెట్లోకి విడుదల చేసిన రెండు రోజుల్లోనే కేవలం చైనాలోనే 14.60 లక్షల మంది ఈ ఫోన్ బుక్ చేసుకున్నారు. ఇందులో భాగంగా చైనా మార్కెట్లో ఒప్పో నుంచి తొలి 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రెండు రోజుల క్రితం ఆవిష్కరించింది. ప్రీమియం సెగ్మెంట్లోని రెనో శ్రేణికి కొనసాగింపుగా ఒకే సారి రెండు మోడళ్లను విడుదల చేసింది ఆ సంస్థ. రెనో 3ప్రో, రెనో 3 పేర్లతో మార్కెట్లోకి వచ్చిన ఫోన్ ధర, ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: గుడ్ న్యూస్.. ఆ పేమెంట్స్‌పై ఇక ఛార్జీలు ఉండవు
undefined
రెనో 3ప్రో ఫోన్ 6.5 అంగుళాల డిస్ ప్లే కలిగి ఉండటంతోపాటు ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంపై పని చేస్తుంది. ఇందులో క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 765జీ చిప్ సెట్ అమర్చారు. 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర 3,999 యువాన్లు (సుమారు రూ.40వేలు), 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ఫోన్ ధర 4,499 యువాన్లు (సుమారు రూ.45వేలు) ఉంటుంది.
ఈ ఫోన్లో వెనుకవైపు నాలుగు కెమెరాలు (48 ఎంపీ + 8 ఎంపీ + 13 ఎంపీ + 2 ఎంపీ), 32 మెగా పిక్సెళ్ల సెల్ఫీ కెమెరా, ఆన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్లు ఉన్నాయి. ఇది 4,025 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ కలిగి ఉంటుంది.
Also Read: ఇక వాట్సాప్ మెసేజేస్ వాటంతట అవే మాయం.. ఎలాగంటే!
రెనో 3 ప్రో ఫోన్ 6.4 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉండటంతోపాటు ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంపై పని చేస్తుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 1000 ఎల్ చిప్ సెట్ అమర్చారు. 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 3,399 యువాన్లు (సమారు రూ.34,000), 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 3,699 యువాన్లు (ధర రూ.37,000) పలుకుతుంది.
వెనుకవైపు నాలుగు కెమెరాలు (48 ఎంపీ + 8 ఎంపీ + 2 ఎంపీ + 2 ఎంపీ) ఉన్నాయి. 32 మెగా పిక్సెళ్ల సెల్ఫీ కెమెరాతోపాటు ఆన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4,025 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ జత కలిపారు. ఈ స్మార్ట్‌ఫోన్ భారత్‌లోకి వచ్చేది ఏప్పుడని ఒప్పో స్పష్టతనివ్వకున్నా వచ్చే ఏడాది మార్చిలో దేశీయ విపణిలోకి ఈ మోడల్ రానున్నట్లు టెక్ వార్తా సంస్థలు అంచనా వేస్తున్నాయి.