Oppo K10: అఫిషియల్ లాంచ్‌కి ముందే ఫీచర్లు లీక్.. 50ఎం‌పి కెమెరాతో అందుబాటులోకి..

By asianet news telugu  |  First Published Mar 21, 2022, 11:04 AM IST

50 మెగాపిక్సెల్‌ ప్రైమరీ లెన్స్ తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంటుంది. ఒప్పో కే10 డిస్ ప్లే డిజైన్ పంచ్ హోల్ గా ఉంటుంది. ఒప్పో కే10తో పాటు, ఒప్పో ఎన్ కొ ఏయిర్ 2 టి‌డబల్యూ‌ఎస్ లాంచ్ కూడా మార్చి 23న జరగబోతోంది.


చైనీస్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ మొబైల్ కమ్యూనికేషన్ కంపెనీ ఒప్పో  (Oppo) కొత్త స్మార్ట్‌ఫోన్  ఒప్పో కే10(Oppo K10) లాంచ్ భారతదేశంలో 23 మార్చి 2022న జరగబోతోంది, అయితే లాంచ్ కి ముందే ఒప్పో కే10 ఫీచర్లు లీక్ అయ్యాయి. మరోవైపు Oppo K10లో స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్ అందించవచ్చని ఒక కొత్త నివేదిక పేర్కొంది. అంతేకాకుండా, ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది, దీని ప్రైమరీ లెన్స్ 50 మెగాపిక్సెల్‌. Oppo K10  డిస్ ప్లే డిజైన్ పంచ్ హోల్ గా ఉంటుంది.  ఒప్పో కే10తో పాటు, Oppo Enco Air 2 TWS లాంచ్ కూడా మార్చి 23న జరగనుంది.

ఇప్పటివరకు వెల్లడించిన సమాచారం ప్రకారం ,  ఒప్పో కే10 ధర రూ. 20,000కి దగ్గరగా ఉండవచ్చు, అయితే అసలు ధర గురించి సమాచారం మార్చి 23న మాత్రమే వెల్లడి కానుంది. Oppo K10 సేల్స్ మార్చి 29 నుండి ఉంటుందని చెబుతున్నారు.

Latest Videos

undefined

 Oppo K10 స్పెసిఫికేషన్లు
దీనిలో మీడియాటెక్ డైమెన్సిటీ 8000 సిరీస్ ప్రాసెసర్‌ ఇచ్చారు, అంటే 5nm ప్రాసెస్‌లో తయారు చేయబడింది. ఊహించిన విధంగా, Oppo K10 Oppo K9 5G సిరీస్  అప్‌గ్రేడ్ వెర్షన్‌గా ప్రదర్శించబడుతుంది. అటువంటి పరిస్థితిలో, ఫీచర్స్ చాలా పోలి ఉంటాయి. Oppo K10లో 6.5-అంగుళాల పూర్తి HD ప్లస్ డిస్‌ప్లేను చూడవచ్చు, దీనికి 90Hz రిఫ్రెష్ రేట్‌ ఉంటుంది.

Oppo K9 5G స్నాప్‌డ్రాగన్ 768Gతో పరిచయం చేసారు, అయితే భారతదేశంలో Oppo K10 మీడియాటెక్ ప్రాసెసర్‌తో ప్రారంభించవచ్చు. Oppo K10లో 128 GB వరకు స్టోరేజీ లభించవచ్చు. ఫోన్‌తో పాటు వర్చువల్ ర్యామ్ కూడా అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా, Oppo K10లో 50 మెగాపిక్సెల్‌ల ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఫోన్ లో 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని పొందుతుంది. ఫోన్ పవర్ బటన్‌లో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కనుగొనవచ్చు.

click me!