OnePlus 10 Pro 5G: వన్‌ప్లస్ 10 ప్రో ఇండియాకు వచ్చేస్తోంది.. స్పెసిఫికేషన్స్ ఇవే..!

By team telugu  |  First Published Mar 20, 2022, 3:31 PM IST

వన్‌ప్లస్ ఫ్యాన్స్‌కు ఎదురుచూస్తున్న రోజు వచ్చేస్తోంది. ఇప్పటికే చైనా మార్కెట్‌లో రిలీజ్ అయిన వన్‌ప్లస్ 10 ప్రో 5జీ (OnePlus 10 Pro 5G) స్మార్ట్‌ఫోన్ త్వరలో ఇండియాలో లాంఛ్ కానుంది.
 


వన్‌ప్లస్ 10 ప్రో 5జీ (OnePlus 10 Pro 5G) స్మార్ట్‌ఫోన్ ఇండియాలో లాంఛ్ కాబోతోంది. ఇప్పటికే ఈ మొబైల్ చైనాలో లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. ఇంకా ఇతర దేశాల్లో అందుబాటులోకి రాలేదు. ఇండియాకు ఈ స్మార్ట్‌ఫోన్ ఎప్పుడు వస్తుందా అని వన్‌ప్లస్ ఫ్యాన్స్ చాలారోజులుగా ఎదురుచూస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ ఇండియాకు వచ్చేస్తోంది. వన్‌ప్లస్ లాంఛింగ్‌కు సంబంధించిన టీజర్‌ను ట్వీట్ చేసింది వన్‌ప్లస్ ఇండియా. వన్‌ప్లస్ 10 ప్రో స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే ఇండియాలో రిలీజ్ అయిన ఐకూ 9 ప్రో (iQOO 9 Pro), సాంసంగ్ గెలాక్సీ ఎస్22, ఐఫోన్ 13 సిరీస్ స్మార్ట్‌ఫోన్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.

వన్‌ప్లస్ 10 ప్రో లాంఛింగ్ సందర్భంగా వన్‌ప్లస్ ఫ్యాన్స్‌కు అద్భుతమైన అవకాశం ఇస్తోంది కంపెనీ. వన్‌ప్లస్ 10 ప్రో గెలుచుకునే ఛాన్స్ ఇస్తోంది. వన్‌ప్లస్‌కు చెందిన ది ల్యాబ్‌లో చేరి వన్‌ప్లస్ 10 ప్రో ఎలా ఉందో స్వయంగా చూడొచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను రివ్యూ చేయడం మాత్రమే కాదు.. ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను గెలుచుకోవచ్చు. మార్చి 26 లోగా రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది.

Latest Videos

undefined

వన్‌ప్లస్ 10 ప్రో స్పెసిఫికేషన్స్

వన్‌ప్లస్ 10 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ విషయానికి వస్తే ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్ చైనాలో రిలీజ్ అయింది కాబట్టి ఫీచర్స్ అన్నీ తెలిసినవే. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల LTPO అమొలెడ్ క్యూహెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్యానెల్ ప్రొటెక్షన్ ఉంది. వన్‌ప్లస్ 10 ప్రో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ రెండు రోజుల క్రితం ఐకూ 9 ప్రో (iQoo 9 ప్రో) స్మార్ట్‌ఫోన్‌తో పాటు సాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ స్మార్ట్‌ఫోన్లలో కూడా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్లకు మోటో ఎడ్జ్ 30 ప్రో గట్టి పోటీ ఇవ్వనుంది. ఇదే ప్రాసెసర్ మోటో ఎడ్జ్ 30 ప్రో, ఐకూ 9 ప్రో, సాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ స్మార్ట్‌ఫోన్లలో ఉంది.

వన్‌ప్లస్ 10 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 48మెగాపిక్సెల్ Sony IMX789 ప్రైమరీ సెన్సార్ + 50 మెగాపిక్సెల్ అల్‌ట్రావైడ్ సాంసంగ్ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ టెర్టియరీ సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది స్వీడన్‌కు చెందిన కెమెరా తయారీ సంస్థ హాసిల్‌బ్లేడ్ పార్ట్‌నర్‌షిప్‌తో కెమెరా సెటప్ రూపొందించింది వన్‌ప్లస్‌. ఇందులో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్ Sony IMX615 కెమెరా ఉంది. వన్‌ప్లస్ 10 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 80వాట్ సూపర్ ఫ్లాష్ ఛార్జ్, 50 వాట్ వైర్‌లస్ ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉండటం విశేషం.

వన్‌ప్లస్ 10 ప్రో ఆండ్రాయిడ్ 12 + కలర్ఓఎస్ 12.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. అయితే ఆక్సిజన్ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వన్‌ప్లస్ 10 ప్రో ఇండియాకు రానుంది. వన్‌ప్లస్ 10 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో బ్లూటూత్ 5.2, వైఫై, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్ లాంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. డ్యూయెల్ నానో సిమ్ సపోర్ట్ లభిస్తుంది. వన్‌ప్లస్ 10 ప్రో స్మార్ట్‌ఫోన్ 8జీబీ+128జీబీ వేరియంట్ సుమారు రూ.54,500 కాగా, 8జీబీ+ 256జీబీ వేరియంట్ ధర సుమారు రూ.58,000, 12జీబీ+256జీబీ వేరియంట్ ధర సుమారు రూ.61,400 రేంజ్‌లో రిలీజైంది. వోల్కానిక్ బ్లాక్, ఎమరాల్డ్ ఫారెస్ట్ కలర్స్‌లో లభిస్తుంది.

click me!